అధిష్టానంపై ఫైట్: రాజ్యసభకు జెసి పోటీ?

అయితే, 2009లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీకి దాదాపు ముప్పై మంది శాసనసభ్యులు దూరమయ్యారు. వీరిలో అధికశాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మిగతా కొందరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసే అభ్యర్థిని ఓడించాలని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే, ఇదే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తీవ్రమైన పదజాలంతో విమర్శించి పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ సైతం అందుకున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జెసి దివాకరరెడ్డిని అసమ్మతి పక్షాన రంగంలోకి దింపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జెసికి సీమాంధ్రలోని సొంత పార్టీ నేతలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
ఈ కారణంగా రాజ్యసభ బరిలో ఆయనను నిలిపితే సానుకూల ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కనీసం 39 మంది జెసి దివాకరరెడ్డి సభ్యత్వాన్ని బలపరచినా ఆయన గెలుపు ఖాయమనే రీతిలో సదరు నేతలున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications