'లోకకళ్యాణమంటే లోకేష్ కళ్యాణమా' (ఫొటోలు)

హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించిన జగన్ సోనియాపై విమర్శులు చేశారు. మరోవైపు, హైదరాబాదులో ఆదివారం ప్రచారం చేసిన షర్మిల మాజీ మంత్రి, ఖైరతాబాద్ కాంగ్రెసు అభ్యర్థి దానం నాగేందర్‌పై కూడా విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ నియంతకు ప్రతిరూపమని వైయస్ జగన్ విమర్శించారు. తెలుగుజాతిని విడదీసిన పాపం సోనియాగాంధీతోపాటు బిజెపి, తెలుగుదేశం పార్టీలకు కూడా అంటుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విడగొడుతుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చోద్యం చూస్తూ తన వంతు సహకారం అందించారని విమర్శించారు.

తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతులు తదితరుల సంక్షేమమే లక్ష్యంగా ఐదు పథకాల అమలుపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఒకవైపు విశ్వసనీయత, నిజాయతీ.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలు మధ్య జరిగే పోరులో ప్రజలు మనస్ఫూర్తిగా దీవించి వైసీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకకల్యాణం అంటే ఆయన లోకేశ్ కల్యాణం అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని చెప్పారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైఎస్ఆర్‌కు దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారని షర్మిల ఆరోపించారు.

సోనియా నియంతకు ప్రతిరూపం..

సోనియా నియంతకు ప్రతిరూపం..

నెల్లూరు జిల్లాలో ఆధివారం ప్రచారం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై మరోసారి విమర్శుల చేశారు. సోనియాను నియంతకు ప్రతిరూపంగా అభివర్ణించారు.

టిడిపి, బిజెపిలపై కూడా..

టిడిపి, బిజెపిలపై కూడా..

రాష్ట్రాన్ని విభజించిన పాపం తెలుగుదేశం, బిజెపిలకు కూడా చుట్టుకుంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.

లోకేష్ కళ్యాణమా..

లోకేష్ కళ్యాణమా..

లోకకళ్యాణమంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కళ్యాణమని అనుకుంటున్నారని వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

దానంపై తీవ్ర వ్యాఖ్యలు

దానంపై తీవ్ర వ్యాఖ్యలు

వైయస్ రాజశేఖర రెడ్డికి మాజీ మంత్రి దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+