సొంత ఇలాకాలో జగన్‌కి బాబు ఝలక్, కెసిఆర్‌కూ..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత ఇలాకాలోనే షాక్ తగిలింది. కడప జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలలో టిడిపినే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. ఏడింటిలో తెలుగుదేశం పార్టీ నాలుగు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడింట విజయం సాధించాయి.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగులను టిడిపి కైవసం చేసుకోగా, ఎర్రగుంట్ల, రాయచోటి, పులివెందులను జగన్ పార్టీ కైవసం చేసుకుంది. కడప కార్పోరేషన్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్కించుకుంది. సీమాంధ్రలో జగన్ హవానే ఉంటుందని ఆ పార్టీ నేతలు మొదటి నుండి చెబుతున్నారు. ఇప్పుడు జగన్ సొంత ఇలాకాలోనే టిడిపి హవా కొనసాగడం గమనార్హం.

ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ హవానే కనిపిస్తోంది. కేవలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో టిడిపి హవా కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం మాత్రం కనిపించడం లేదు.
రఘువీరా, కెసిఆర్‌లకు షాక్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డిలకు సొంత ఇలాకాలోనే షాక్ తగిలింది. రఘువీరా రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మడకశిరలో టిడిపి గెలుపొందింది. అలాగే కెసిఆర్ పోటీ చేసిన గజ్వెల్ మున్సిపాలిటీని సైకిల్ దక్కించుకుంది.












Click it and Unblock the Notifications