పవన్ కళ్యాణ్ పంచ్: కెసిఆర్ తనయ మౌనమేలనో...
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్‌కు కవిత సమాధానం ఇవ్వకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా ఆయితే కవిత ప్రత్యర్థులపై మాటల ఈటెలతో విరుచుకుపడుతారు. పవన్ కళ్యాణ్‌పై మాత్రం మౌనం వహిస్తున్నారు.
"అమ్మా కవితా... జన జాగృతి పేరుతో నువ్వు వసూలు చేసిన విరాళాలు లెక్కలేమిటమ్మా" అంటూ పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ పై జనజాగృతి అధ్యక్షురాలు, కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పటివరకూ నోరు తెరవలేదు. దీంతో ఆ విరాళాల వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది.

సవాల్ విసిరిన సందర్భంలో పవన్ కళ్యాణ్ తన ఎన్నారై స్నేహితుడు కూడా విరాళాలు ఇచ్చినట్లు తనతో చెప్పారని పవన్ అన్నారు. మరోవైపు పవన్ పార్టీ ప్రకటనకు ముందు గంగిరెద్దు దుకాణాలు చాలా వస్తాయని కెసిఆర్ భలేగా వెక్కిరించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన సమయంలో కెసిఆర్ పైన కూడా సెటైర్లు విసిరారు. నే పార్టీ పెట్టేదాక ఆగనయ్యవె అంటూ ఎద్దేవా చేస్తూనే కెసిఆర్ కు కౌంటర్ ఇచ్చారు. దీనిపై కూడా కెసిఆర్ కిక్కురుమనలేదు. ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ మళ్లీ ఎలాంటి కౌంటర్ ఇ
కవితనే కాదు, కెసిఆర్ సరే, తెరాస నాయకులెవరూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేరు. కొంత కాలం మౌనం పాటించడమే మంచిదని, సమాధానం ఇస్తే అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని తెరాస నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications