అసెంబ్లీలో జగన్‌కు చురక, దేవుడికి వదిలేద్దాం

దీనికి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ ఇంకా కలల ప్రపంచంలోనే విహరిస్తున్నారని చురకలు వేశారు. ఇన్నాళ్లు ఆయన కలలు కన్నారని, ఇప్పుడు కూడా కలలు కంటున్నారని, తాము ఎప్పటికీ ఇక్కడే (అధికారం)లో ఉంటామన్నారు.
యనమల వ్యాఖ్యలకు జగన్ స్పందిస్తూ.. ఎవరు అధికారంలో ఉండాలో, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడన్నారు. 1999లో తన తండ్ర వైయస్ రాజశేఖర రెడ్డి అధికార పక్షంలో ఉన్నారని, అప్పుడు టిడిపిలోను ఇదే ధైర్యం కనిపించిందని, ఆ తర్వాత కథ మారిందని (2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది) చెప్పిన జగన్... ఇది దేవుడికి వదిలేద్దామన్నారు. బిజెపి సభ్యులు మాట్లాడుతూ.. తాము జాతీయ పార్టీ సభ్యులుగా సభలో ఉన్నామని చెప్పారు.
కాగా, రాష్ట్రం విడిపోయి కొత్త సమస్యలు ఏర్పడిన ఈ సమయంలో ప్రజా సమస్యలు ఉంటాయని, వాటిని మీ ద్వారా అధికార పార్టీ దృష్టికి తీసుకు వస్తామని వైయస్ జగన్ చెప్పారు. కోడెల రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. సభలో ఒకటి ప్రతిపక్షం, రెండోది పాలక పక్షం మాత్రమే ఉందన్నారు.












Click it and Unblock the Notifications