వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో జగన్ పోటీ: కేరళ శాఖతో జాతీయ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన పార్టీని వైయస్ జగన్ జాతీయ పార్టీగా రూపుదిద్దేందుకు వ్యూహరచన చేశారు. తెలంగాణలో బలంగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని, దానికితోడు అండమాన్ దీవులకు విస్తరిస్తున్నామని, ఆ రకంగా తమది జాతీయ పార్టీ అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుండగా, చంద్రబాబుతో పోటీ పడి తన పార్టీకి కూడా జాతీయ పార్టీ గుర్తింపు తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ కేరళ శాఖను ఏర్పాటు చేసి జాతీయ పార్టీగా మారేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా కేరళకు చెందిన కొంతమంది వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పులివెందులకు వచ్చి జగన్‌తో చర్చలు జరిపి వెళ్లారని చెబుతున్నారు. తాము కేరళలో వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ శాఖను ప్రారంభిస్తామ ని వారు ప్రతిపాదించారని సమాచారం.

YSR Congress Kerala wing will be started

కేరళలో పార్టీ శాఖ ఏర్పడితే తమది కూడా తమది జాతీయ పార్టీ అని గట్టిగా చెప్పుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు అవకాశం లభిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కమిటీని నియమించిన జగన్ త్వరలోనే ఇతర రా ష్ట్రాలపై కూడా దృష్టి సారించే అవకాశం వుందని సమాచారం.

జయప్రకాశ్‌ నారాయణ ఢిల్లీ శాఖను ఏర్పాటు చేసి దెబ్బ తిన్న వ్యవహారం ఈ సందర్భంగా కొంత మంది గుర్తు చేస్తున్నారు. జేపీకి మోడీ వద్ద మంచి పలుకు బడి ఉందని, రాబోయే రోజుల్లో జెపి చక్రం తిప్పుతాడని అంటూ లోక్‌ సత్తా పార్టీ ఢిల్లీ విభాగాపు వ్యక్తి విూడియా వద్ద వ్యాఖ్యానించి స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.

English summary
It is said that YS jagan may launch his YSR Congress party wing in Kerala soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X