16వ శతాబ్దం నాటి బంగారు చీరను 'తెలంగాణ'కు
హైదరాబాద్: తెలంగాణ మ్యూజియంకు బంగారు చీర ఇచ్చింది ఓ చేనేత కుటుంబం. దాదాపు 350 సంవత్సరాలుగా తమ కుటుంబానికి వారసత్వ సంపదగా వస్తున్న 800 గ్రాముల బంగారంతో నేసిన చీరను హైదరాబాద్‌లో నివసిస్తున్న చేనేత కార్మికులు బ్రిజ్ గోపాల్ షా, ప్రమోద షా, సందీప్ షా తెలంగాణ రాష్ట్ర మ్యూజియమ్‌కు బహూకరించారు.
నిజాం కాలంలో తమ పూర్వీకులు ఇలాంటి చీరలను తయారు చేసేవారని వారు తెలిపారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఏడాది సందర్భంగా బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి సమక్షాన మ్యూజియం డైరెక్టర్ శ్రీనివాస్‌కు వారు ఈ చీరను అందించారు.
మఖ్‌మల్ వస్త్రంపై 850 గ్రాముల బంగారు జలతారుతో నేసిన ఈ చీరను తెలంగాణ రాష్ట్రానికి బహుమతిగా ఇవ్వడం గర్వకారణమని కేవీ రమణాచారి అన్నారు. చేనేతకు ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో ఈ చీరను చూస్తే తెలుస్తున్నదన్నారు. 350 ఏళ్ల కాలం నాటి చీరను ఇన్నేళ్లుగా భద్రంగా ఉంచడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. దీని విలువ రూ.8 లక్షలు ఉంటుందని చెప్పారు.

'బంగారు' చీర
తెలంగాణ మ్యూజియంకు బంగారు చీర ఇచ్చింది ఓ చేనేత కుటుంబం. దాదాపు 350 సంవత్సరాలుగా తమ కుటుంబానికి వారసత్వ సంపదగా వస్తున్న 800 గ్రాముల బంగారంతో నేసిన చీరను హైదరాబాద్‌లో నివసిస్తున్న చేనేత కార్మికులు బ్రిజ్ గోపాల్ షా, ప్రమోద షా, సందీప్ షా తెలంగాణ రాష్ట్ర మ్యూజియమ్‌కు బహూకరించారు.

'బంగారు' చీర
నిజాం కాలంలో తమ పూర్వీకులు ఇలాంటి చీరలను తయారు చేసేవారని వారు తెలిపారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఏడాది సందర్భంగా బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి సమక్షాన మ్యూజియం డైరెక్టర్ శ్రీనివాస్‌కు వారు ఈ చీరను అందించారు.

'బంగారు' చీర
మఖ్‌మల్ వస్త్రంపై 850 గ్రాముల బంగారు జలతారుతో నేసిన ఈ చీరను తెలంగాణ రాష్ట్రానికి బహుమతిగా ఇవ్వడం గర్వకారణమని కేవీ రమణాచారి అన్నారు.

'బంగారు' చీర
చేనేతకు ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో ఈ చీరను చూస్తే తెలుస్తున్నదన్నారు. 350 ఏళ్ల కాలం నాటి చీరను ఇన్నేళ్లుగా భద్రంగా ఉంచడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు.












Click it and Unblock the Notifications