వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిలో ఇసుక తింటేనే ఆ బామ్మకు ఆకలి తీరుతుంది

|
Google Oneindia TeluguNews

లక్నో: మనం తినే ఆహారంలో ఒక ఇసుక రాయి వస్తేనే తీసి పారేస్తాం. కానీ ఈ బామ్మకు మాత్రం ఇసుక తింటేనే ఆకలి తీరుతుంది. అందుకే ఆమె ప్రతీ రోజూ ఓ కిలో తినేస్తోంది. ఆమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కజ్రినూర్‌పుర్‌కు చెందిన సుదామ దేవి(92).

గత 80ఏళ్ల నుంచి ఆమె ఇసుక తినే బతుకుతోంది. ఆమె మొదటి సారిగా 10సంవత్సరాల వయస్సులో తన స్నేహితులతో పందెం కాసి ఇసుకను ఆహారంగా తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికీ రోజుకు ఒక కిలో ఇసుకను ఆహారంగా తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

A 92 year indian woman eats 1 kg sand everyday

తన పెళ్లికి ముందు తండ్రి, అన్నయ్య తన కోసం ఇసుకను తీసుకువచ్చేవారని, తర్వాత తన భర్త కిషన్ కుమార్ తన కోసం ఇసుకను తీసుకొస్తున్నారని చెప్పింది.

అంతేగాక, తను ఏ ఆహారాన్నైనా ఇసుకతో తింటేనే తన ఆకలి తీరుతుందని తెలిపింది. కాగా, ఆమపై పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె ఇప్పటికీ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయం తమకు ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు.

English summary
A 92-year-old Indian woman who admitted she eats a kilogram of sand every day has amazed doctors with her perfect health. Sudama Devi first ate sand for a bet with friends when she was aged just ten.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X