బాబోయ్ దెయ్యం: 9నెలలుగా తెరచుకోని కోర్టు హాల్
మైసూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు కోర్టు హాలులో దెయ్యం సంచరిస్తుందనే పుకార్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ దెయ్యాల భయానికి కోర్టు హాలు కొన్ని నెలలుగా మూతపడటం గమనార్హం. తొమ్మిది నెలల కిందట మూతబడిన సదరు కోర్టు హాలును ఇప్పటికీ తెరవొద్దంటూ అక్కడి న్యాయవాదులే డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. గతంలో ఇదే కోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయి దెయ్యమై అందులో సంచరిస్తున్నాడనే పుకార్లతో ఆ హాలును గత మే నెలలో మూసివేశారు. ప్రస్తుతం ఇందులో విరిగిపోయిన బల్లలు, కుర్చీలు వేసి స్టోర్ రూమ్‌గా వాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన కేసుల వాదనలకు ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులకు నెలవుగా నిలిచిన ఆ కోర్టు హాలు... మూఢనమ్మకాల కారణంగా మూతబడిపోయింది.

న్యాయవాదులే పట్టుబట్టి, దగ్గరుండి మరీ ఆ హాలును మూయించడం గమనార్హం. అది కాకుండా కోర్టు అధికార వర్గాలు కూడా ఆ గదిని తెరవాలన్న ప్రయత్నం గానీ, అందులో ఎవరికైనా పోస్టింగ్ ఇవ్వాలన్న ఆలోచన గానీ చేయడం లేదు. ఒక వేళ తెరవాలని అనుకుంటున్నప్పటికీ దెయ్యాలను పారద్రోలే పూజలు చేయించే వరకు ఆ కోర్టు హాలును తెరవొద్దని జ్యోతిష్యులు సూచించారట.
ఇంతకి ఆ హాలులో దెయ్యం ఉందా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. కాగా, కొందరు కోర్టు హాలును తెరవాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు లాయర్లు మాత్రం వారితో విభేదిస్తున్నారు. న్యాయవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి ఇదే విషయంలో పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. ఏదైమైనా 9 నెలలు గడిచినా ఆ కోర్టు హాలు మాత్రం ఇప్పటికీ తెరచుకోలేదు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications