ఎంపి రాపోలు ఆనంద భాస్కర్ భిక్షాటన

నల్లగొండ: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ యాచనకు దిగారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పగుడాల నగేష్ చేనేత కార్మిక కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామంలో ప్రధాన వీధులలో రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ సోమవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

సామాజిక సమస్యలతో జీవితాలను అంతం చేసుకుంటున్న కార్మిక కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన సంక్షేమ చర్యలు తీసుకోవాలని కోరారు.

 MP Rapolu Anand Bhaskar begs for handloom weavers

చేనేత రంగ వస్త్ర ఉత్పత్తిలో ఖండాతర ఖ్యాతి గాంచిన ఈ ప్రాంతంలో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి చనిపోవడం ఆందోళనకరమన్నారు. సిరిసిల్లలో శ్రీకాంత్, దుబ్బాకలో కొందరు, పోచంపల్లిలో నగేష్ నేత కార్మికులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. భూదాన్ పోచంపల్లి గ్రామంలో ప్రధాన వీధుల గుండా భిక్షాటన చేశారు. తన వంతు 10వేల ఆర్థిక సాయంతో పాటు 50వేల రూపాయలను సేకరించి నగేష్ అనే మృతుడి కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలిండియా హ్యాండ్‌లూమ్ బోర్డు సభ్యులు తడక యాదగిరి, జిల్లా చేనేత జౌళి శాఖ ఎడి సంజీవరావు, తహశీల్దార్ విజయకుమారీ, ఎంపిడివో నరేందర్‌రెడ్డి, పద్మశాలి మేథావుల పోరం అధ్యక్షులు ప్రొఫెసర్ బాలకృష్ణ, చేనేత నాయకులు కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, గోలి యాదగిరి, పట్నం కృష్ణకుమార్, శ్రీనివాస్, చండికేశ్వర్, ఎ.మురళి, రమేష్, స్వామి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+