దావూద్ కారు తగులబెట్టారు,అవశేషాలతో మరుగుదొడ్డి
లక్నో: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కారుకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి బుధవారం నాడు బహిరంగంగా నిప్పుబెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఈ కారును ఆయన తగులబెట్టారు.
కారు ముందు భాగంలో దావూద్ ఫొటోలను ఉంచి, కారు లోపల, బయట కట్టెలు పేర్చారు. అనంతరం చక్రపాణి దానికి నిప్పును అంటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కారు దగ్ధంతో తీవ్రవాదానికి అంత్యక్రియలు జరిపామన్నారు. ఇది తీవ్రవాదం వద్దని చెప్పడానికి ఓ సందేశం అన్నారు.

దావూద్ ఇబ్రహీం వాడిన ఎంహెచ్04-ఏఎక్స్3676 అనే నంబరు గల హ్యుందాయ్ యాక్సెంట్ గ్రీన్ కలర్ కారును కొద్ది రోజుల క్రితం జరిగిన వేలం పాటలో చక్రపాణి దక్కించుకున్నారు. దానిని తొలుత అంబులెన్సుగా ఉపయోగించాలనుకున్నారు.
ఓ వ్యవసాయ క్షేత్రంలో బహిరంగంగా ప్రజల సమక్షంలో చక్రపాణి దానిని తగులబెట్టారు. వేలం పాటలో ఈ కారును అతను రూ.32వేలకు సొంతం చేసుకున్నారు. కాగా, తగులబెట్టగా మిగిలిన అవశేషాలతో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నట్లు స్వామి చక్రపాణి చెప్పారు.












Click it and Unblock the Notifications