జగన్ కోసం టీడీపీ నయా స్కెచ్..
ఈరోజుల్లో రాజకీయాలు ఎటు పోయి ఎటు వస్తాయో ఓ అంచనాకి రావడం కష్టమే. నిన్నటిదాకా దోస్తీ కట్టిన పార్టీలు తెల్లారేసరికి ప్లేటు ఫిరాయించొచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికైనా వెనుకాడని పరిస్థితి. ప్రత్యర్థిని కట్టడి చేయడం మిత్ర పక్షాల్ని సైతం ఓ పావులా వాడుకుంటాయి. తాజా ఏపీ రాజకీయాలను చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.
టీడీపీ అనుకూల వర్గంగా ముద్రపడ్ద ఒక ప్రముఖ పత్రిక.. వైసీపీతో బీజేపీ జత కట్టబోతుందని ప్రచారం చేయడం చూస్తోంటే జగన్ ప్రాబల్యాన్ని నీరు గార్చేందకే ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులతో ఇప్పటికే ఢీలా పడ్ద వైసీపీని దెబ్బ మీద దెబ్బ కొట్టాలనే ప్లాన్ తోనే ఈ కొత్త రకం ప్రచారానికి తెరలేపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మైనారిటీల్లో, దళితుల్లో బీజేపీకి అంతగా ఓటు బ్యాంకు లేదు. అదే సమయంలో జగన్ కి ఆ వర్గాల్లో మంచి పట్టున్న విషయం తెలిసిందే. సరిగ్గా దీనిపై కన్నేసిన టీడీపీ 2019 నాటికి బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకుని, మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీతో వైసీపీ జత కట్టబోతోందని జగన్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోను చంద్రబాబు బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పార్టీ ప్రయోజనాల కోసం మళ్లీ దాన్నే ఫాలో అవుతారన్న మాట వినిపిస్తోంది. ఇదంతా పక్కనబెడితే 2019 నాటికి బీజేపీ మేనియా ఏ మాత్రం ఉండదని టీడీపీ అప్పుడే ఎలా ఫిక్స్ అయిందో..!












Click it and Unblock the Notifications