అనితకి ఛాన్స్‌:టిడిపి మహిళా ఎమ్మెల్యేల అసంతృప్తి?

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో డ్వాక్రా రుణాల పైన చర్చ సందర్భంగా మహిళా మంత్రిని సొంత పార్టీనే అవమానించిందంటూ తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేల్లో చర్చ సాగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం డ్వాక్రా రుణాల పైన చర్చ జరిగింది.

ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అనిత ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం చెప్పాక కూడా ఎమ్మెల్యే అనితకు మరోసారి అవకాశం ఇచ్చారు. అలా ఇవ్వడం మంత్రి మృణాళిని అవమానించినట్లేనని మహిళా ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

TDP women MLA unhappy with party High Command?

తరుచూ మాట్లాడేందుకు ఓ మహిళా ఎమ్మెల్యేకే మాత్రం అవకాశం ఇస్తున్నారని ఇతర మహిళా ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనితకు మరోసారి అవకాశం ఇవ్వడం వల్ల మంత్రిని అవమానించారని చర్చించుకుంటున్నారట.

ఒకవేళ మంత్రి సమాధానం సరిపోకుంటే మరో మంత్రితో సమాధానం చెప్పిస్తే సరిపోయేదని, అనితకు మరోసారి అవకాశం ఇవ్వడం ఏమిటని అభిప్రాయపడుతున్నారంటున్నారు. కేవలం విమర్శళ కోసం అనితకు అవకాశం ఇచ్చారని చర్చ జరుగుతోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+