నిన్న 47 మందికి, మరి నేడు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతవాళ్లకు మోడీ షాక్?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు గతంలోని తమ వ్యూహాన్ని అమలు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అదే జరిగితే పలువురు సిట్టింగులకు టిక్కెట్లు రావు.
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు గతంలోని తమ వ్యూహాన్ని అమలు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అదే జరిగితే పలువురు సిట్టింగులకు టిక్కెట్లు రావు.

బీజేపీకి ఇలా ఇబ్బందులు
గుజరాత్‌లో ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. 2001 నుంచి ప్రధాని అయ్యే వరకు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితులు బీజేపీకి అననుకూలంగా మారాయి. హార్దిక్ పటేల్, జిగ్నేష్ హేవానీ, అల్పేష్ ఠాకూర్‌ల కారణంగా కమలం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవచ్చు
పైగా ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రజా వ్యతిరేకత కొట్టిపారేయలేం. ప్రజావ్యతిరేకత, స్థానిక పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని మోడీ - షా ద్వయం కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవచ్చునని భావిస్తున్నారు.

అప్పుడు మోడీ ఇలా నిరాకరించారు
2007లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ 47 మంది సిట్టింగులకో టిక్కెట్ నిరాకరించారు. 2012లో దాదాపు ముప్పై మందికి టిక్కెట్ నిరాకరించారు. 2002లో మాత్రం కేవలం 18 మందికి మాత్రమే టిక్కెట్ ఇవ్వలేదు. అయితే, ఈసారి ప్రజా వ్యతిరేకత, హార్తిగ్ పటేల్, జిగ్నేష్, అల్పేష్‌ల ప్రభావం, స్థానిక కారణాలతో ఎంతమందికి టిక్కెట్ నిరాకరిస్తారోననే చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ ఇలా పావులు కదుపుతోంది
కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం యువ నేతల సాయం తీసుకోవడంతో పాటు ఖామ్ (క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లీం) ఫార్ములాను ఉపయోగిస్తోంది. దీంతో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతోంది. దీంతో బీజేపీ వైపు బ్రాహ్మిణ్, బనియా, ఓబీసీలు, ముఖ్యంగా ఈ ఓబీసీలో కోలీలు బీజేపీ వైపు ఉంటే అవకాశముంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications