కేఈ కృష్ణమూర్తిన పక్కన పెట్టిన చంద్రబాబు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి చేదు అనుభవం ఎదురైందని అంటున్నారు. జిల్లాల ఇంచార్జుల మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు.

తెరపైకి మాజీ అధికారి: పవన్ కళ్యాణ్‌కు బాబు కౌంటర్

కేబినెట్లో అందరికంటే సీనియర్ నేత అయినప్పటికీ ఆయనను పక్కన పెట్టారని అంటున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు.

Is KE Krishnamurthy face bitter experience?

మంత్రులు శిద్ధా రాఘవ రావు, పరిటాల సునీతలను కూడా ఇంచార్జి మంత్రులుగా నియమించలేదు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావులను కూడా పక్కన పెట్టారు. కాగా, ఆయా జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమిస్తూ సీఎస్ దినేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీకాకుళంకు పితాని సత్యనారాయణ, విజయనగరంకు గంటా శ్రీనివాస రావు, విశాఖకు చినరాజప్ప, తూర్పు గోదావరికి కళా వెంకట్రావు, పశ్చిమ గోదావరికి పుల్లారావు, కృష్ణాకు యనమల రామకృష్ణుడు, గుంటూరుకు అయ్యన్నపాత్రుడు, ప్రకాశంకు నారాయణ, నెల్లూరుకు అమర్నాథ్ రెడ్డి, చిత్తూరుకు అచ్చెన్నాయుడు, కడపకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కర్నూలుకు కాల్వ శ్రీనివాసులు, అనంతపురంకు దేవినేని ఉమలను నియమించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is Deputy Chief Minister KE Krishnamurthy face bitter experience?
Please Wait while comments are loading...