టిఆర్ఎస్‌లోకి రేవంత్: బాంబు పేల్చిన తలసాని, అదే జరిగితే, కానీ...

కొడంగల్: టిడిపిని వీడేందుకు రేవంత్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. టిఆర్ఎస్‌లో కూడ చేరేందుకు రేవంత్‌రెడ్డి నాతో సంప్రదింపులు జరిపారని మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది.

నలుగురు మంత్రులు ప్రత్యేకించి ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్‌రెడ్డిని దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.

Recommended Video

    Revanth Reddy : సీతక్క ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్ | Oneindia Telugu

    మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డితో కలసి గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో యాదవులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెలు పంపిణీ చేశారు.

    రేవంత్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరేందుకు నాతో చర్చించారు

    రేవంత్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరేందుకు నాతో చర్చించారు

    రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తనతో సంప్రదింపులు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టిఆర్ఎస్‌లో చోటు దక్కకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు.టిఆర్ఎస్‌లో రేవంత్‌రెడ్డి చేరాలని చివరివరకు ప్రయత్నాలు సాగించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

    నేనే చేరాక రేవంత్ కూడ మాట్లాడారు

    నేనే చేరాక రేవంత్ కూడ మాట్లాడారు

    తాను టిఆర్ఎస్‌లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరేందుకు వస్తానని తనతో చర్చించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.అయితే ఈ విషయాన్ని పాలమూరు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే మంత్రుల నుండి సానుకూల సంకేతాలు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

    మంత్రులు రేవంత్ రాకను అడ్డుకొన్నారు.

    మంత్రులు రేవంత్ రాకను అడ్డుకొన్నారు.

    పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులకు రేవంత్‌రెడ్డిపై సదభిప్రాయం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఒకవేళ ఆనాడే మంత్రులు సానుకూలంగా స్పందిస్తే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరేవాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు.

    అప్పుడు కొడంగల్ పౌరుషం ఏమైంది

    అప్పుడు కొడంగల్ పౌరుషం ఏమైంది

    ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లినప్పుడు కొడంగల్‌ పౌరుషం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఆనాడు కొడంగల్ పౌరుషం గుర్తుకు రాలేదా అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం కొడంగల్ పౌరుషం గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+