'పొరపాటుగా ఓసారి శృంగారంలో పాల్గొంటే పెళ్లి జరిగినట్టు కాదు'

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: స్త్రీ, పురుషులిద్దరు అనుకోకుండానో లేదా పొరపాటుగానో ఓ రోజు శృంగారంలో పాల్గొంటే అది వివాహం కిందకు రాదని బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవకాశం రావడం వలన, చాన్స్ తీసుకోవడం వలన లేదంటే అనుకోకుండానో జరిగే శృంగారం హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లికి నిర్వచనం కాదని తేల్చి చెప్పింది.

అలా పుట్టిన సంతానానికి తండ్రి ఆస్తిపై హక్కులు ఉండవని పేర్కొంది. వివాహం కాకుండా అది చెల్లుబాటు కాదని తెలిపింది. ఈ సందర్భంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 16 గురించి ప్రస్తావించిన జస్టిస్ మృదుల భట్కర్.. ఈ చట్టం వివాహాన్ని నియంత్రిస్తున్నప్పటికీ సామాజికంగా జరుగుతున్న మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

One night stand cannot amount to marriage, says Bombay HC

కొన్ని దేశాలు హోమో సెక్స్‌వల్ యూనియన్లను వివాహంగా అంగీకరిస్తున్నాయని తెలిపారు. ఫలితంగా సహజీవనం వల్ల కలిగే సంతానం విషయంలో పలు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి.

చట్టాన్నే సవాలు చేసే పరిస్థితి ఎదురవుతోందన్నారు. వివాహ నిర్వచనాన్ని ఇది మారుస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఓ కేసు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an important order, the Bombay High Court said that a physical relationship between a man and a woman by choice or by chance or by accident does not fall under the the definition of marriage under Hindu laws.
Please Wait while comments are loading...