• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉ.కొరియాలో ఇలాంటి వ్యవస్థ ఉందా?: అణిచివేతకు బీజం ఇక్కడే.. మరో విస్తుపోయే నిజం..

|

ప్యోంగ్‌యాంగ్: పేరుకు సోషలిస్టు దేశమైనా అసమ విలువలను పెంచి పోషించడం ద్వారానే ఉత్తరకొరియాలో నియంత్రుత్వం నేటికీ వర్థిల్లుతోంది. తాతలు, తండ్రుల నియంత్రుత్వపు పోకడలనే ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అనుసరిస్తున్నారు.

మళ్లీ మొదలైందా?: ఉ.కొరియా నుంచి ఆ 'సిగ్నల్స్'.. జపాన్ కథనంతో అలర్ట్..

ఉత్తరకొరియాలో ఇంతటి నియంత్రుత్వం రాజ్యమేలుతున్నా.. అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. తిరుగుబాటుకు అవకాశం లేకుండా దశాబ్దాల క్రితమే అక్కడ పకడ్బంధీ వ్యూహాలు అమలు చేయబడ్డాయి. ప్రజలను వర్గాలుగా విభజించడం ద్వారా వారిలో ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర పాలక వర్గాల నుంచి 1957సమయంలోనే అమలు చేయబడింది.

కిమ్ Il సంగ్ కాలంలో:

కిమ్ Il సంగ్ కాలంలో:

1957లో ఉత్తరకొరియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అప్పటి అధ్యక్షుడు కిమ్ Il సంగ్ చాలా ప్రయత్నాలే చేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల ద్వారా విచారణ చేపట్టి కీలక వివరాలు సంపాదించారు. ఏం చేస్తే ప్రజలు ప్రశ్నించకుండా.. ఐక్యత లేకుండా ఉంటారన్న దానిపై అందులో ప్రధానంగా దృష్టి సారించారు. తత్ఫలితంగా పుట్టిందే ప్రజలను వర్గాలుగా విభజించాలన్న ఆలోచన.

ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..

 మూడు వర్గాలు:

మూడు వర్గాలు:

ఉత్తరకొరియా ప్రజలను మూడు వర్గాలుగా విభజించడం ద్వారా వారిలో ఎప్పటికీ ఐక్యత లేకుండా చేయాలని అధ్యక్షుడు కిమ్ Il సంగ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హాస్టిల్స్, వేవరింగ్, కోర్ అనే మూడు వర్గాలుగా అక్కడి ప్రజలను విభజించారు. ఇందులో ఉపవర్గాలను కూడా సృష్టించారు.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

 ఏంటీ వర్గాలు?:

ఏంటీ వర్గాలు?:

అధ్యక్షుడు కిమ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, యాంటీ జపనీస్ లను 'కోర్' కేటగిరీలో చేర్చారు. ఉత్తరకొరియాలో మంచి సదుపాయాలను అనుభవించడానికి, పొలిటీషయన్లుగా ఎదగడానికి కేవలం వీరికి మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఒకవిధంగా వీరంతా రూలింగ్ క్లాస్.

ఇక హాస్టిల్స్ కేటగిరీలో కూలీలను, పేదలను, ఒకప్పటి భూ ఆధిపత్యాలపై తిరగబడ్డవాళ్లను సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న బలహీనులను చేర్చారు. ఒకప్పటి జపనీస్ పాలనలో వీరంతా ఉన్నతంగా బతికిన వర్గాలుగా చెబుతారు. అందుకే కిమ్ ఈ వర్గంపై కక్ష కట్టి హాస్టిల్స్ వర్గంలో చేర్చినట్టు ప్రచారం ఉంది.

ఇక కోర్‌కు, హాస్టిల్స్‌కు మధ్య ఓ తటస్థ వర్గాన్ని కూడా కిమ్ ఏర్పాటు చేశారు. అదే 'వేవరింగ్'. ఈ వర్గంలోని ప్రజలకు 'కోర్' కేటగిరీలోకి వెళ్లే అవకాశం కూడా కల్పించారు. అయితే ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగానే కనిపిస్తోంది. కిందికి పడిపోవడమే తప్పితే పైకి ఎదగడం అన్న దానికి ఉత్తరకొరియాలో చోటే లేదు.

'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

ఆత్మగౌరవం లేని జీవితం:

ఆత్మగౌరవం లేని జీవితం:

హాస్టిల్స్ వర్గానికి కిమ్ Il సంగ్ చదువును కూడా నిరాకరించారు. రాజధాని ప్యోంగ్ యాంగ్‌లో ప్రవేశించడానికి కానీ, అక్కడ నివసించడానికి కానీ వీరికి అనుమతి ఉండదు. కడు దారిద్య్రాన్ని, ఏమాత్రం ఆత్మగౌరవం లేని జీవితాన్ని వీరు గడుపుతున్నారు.

ఉత్తరకొరియాలో వర్గాల విభజన గురించి 2016లో ఓ అంతర్జాతీయ మీడియాలో ఒక కథనం వెలువడింది. ఆ కథనం ప్రకారం.. 'చోయ్ సియోంగ్ చోల్ అనే వ్యక్తి ఉత్తరకొరియాలో 1990లో జన్మించాడు. భవిష్యత్తులో అతను ఏవిధంగా అణిచివేయబడుతాడో అతని తల్లిదండ్రులకు అప్పటికే తెలుసు. అతని చదువుకు, తిండి, ఆరోగ్యం ఇతరత్రా వంటి సంక్షేమాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది.'

'కానీ అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఏది చెబితే అది చేయడమే వారి విధి. సొంత ఆలోచనలకు, నిర్ణయాలకు ఇక్కడ తావు లేదు. పుట్టుకతోనే రూలింగ్ కొరియన్ వర్కర్స్ పార్టీలోకి వెళ్లేవారు ఎవరు?, మిలటరీలోకి వెళ్లేవారు ఎవరు? అనేది వర్గాల ఆధారంగానే నిర్ణయమవుతుంది' అని ఆ కథనంలో పేర్కొన్నారు. ఉత్తరకొరియాలో ప్రజల స్వేచ్చా స్వాతంత్య్రాలను దశాబ్దాలుగా కిమ్ కుటుంబం ఎలా హరించివేస్తుందో చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది.

English summary
In 1957, when Kim Il Sung was struggling to retain control over North Korea, he launched a massive investigation into the populace of the country. The end result of that investigation was a completely changed social system that separated everybody into three classes: “hostiles,” “wavering,” and “core.” The designations were based not on the person, but on their family history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X