బెడ్రూం నిండా కెమెరాలే: ఆ లేడీ వలలో 25 మంది ఎంపీలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాజస్థాన్ బిజెపి ఎంపీ కెసి పటేల్ హానీ ట్రాప్ వ్యవహారాన్ని లాగితే డొంకంతా కదిలింది. తనను రేప్ చేశాడంటూ ఆరోపణలు చేసిన ఆ కిలాడీ లేడీ సామాన్యురాలు కాదని తేలింది. నిజానికి, ఆమె ఐఎఎస్ చదివి కలెక్టర్ కావాలని కన్నది. ఆ కల నెరవేరలేదు.

రాజస్థాన్‌ ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించాలని కోరుకుంది. అదీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు పార్లమెంటు సభ్యులను బోల్తా కొట్టించి తర్వాత వారిని బెదిరిస్తూ వసూళ్లు ప్రారంభించింది. ఇటీవల రాజస్థాన్‌ ఎంపీ కెసి పటేల్‌ను మాయ చేసిన ఆ యువతి ఆయనతో అసభ్యకర పొజిషన్లలో ఫొటోలు దిగి రూ.5 కోట్లు డిమాండ్‌ చేసింది. దీంతో ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Police arrest woman who ‘honey-trapped’ BJP MP KC Patel, alleged rape

ఈమెను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. ఈమె వెనుక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు వెల్లడైంది. ఏకంగా 25 మంది ఎంపీలను ఈమె ఇలా మోసం చేసినట్లు బయటపడింది. ఈ జాబితాలో కేసీ పటేల్‌ సహా పలువురు ఉన్నారు.

ఈ మహిళ బెడ్‌ రూంలో నిండా కెమెరాలే ఉన్నట్లు తెలిసింది. ఏ మూలన ఉన్నా వాటిలో స్పష్టంగా రికార్డవుతుంది. ఈమె వద్ద నిత్యం 4 స్పై కెమెరాలుంటాయి. ఈకెమెరాలో డేటాతో ఎంపీలను బెదిరిస్తుంటుంది. ఎంపీకి ఫోన్‌ చేసి న్యాయ సమస్యలున్నాయని చెబుతుంది.

ఇంటికి వస్తే కలిసి మాట్లాడదామని పిలుస్తుంది. ఎంపీ ఇంటికి వెళ్తే వారిని బెడ్‌రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ మత్తుమందిచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు బయటపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MP KC Patel had filed a complaint with Delhi Police allegeing that the woman drugged him and took his pictures to blackmail him later. The woman had filed a complaint of rape against the MP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి