రేవంత్ రెడ్డి ఔట్: ఇంకా టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా??

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి పార్టీ వీడాక తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత కష్టంగా తయారవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు ఎవరి భవిష్యత్తు వారు చూసుకున్న ఆశ్చర్యం లేదంటున్నారు.

పోటీకి రేవంత్ సిద్ధం, మధ్యాహ్నం గన్‌మెన్ల సరెండర్: కార్యకర్తలతో భేటీ

అప్పటి నుంచి టీడీపీకి దెబ్బ

అప్పటి నుంచి టీడీపీకి దెబ్బ

ఓటుకు నోటు కేసు నుంచి తెలంగాణలో టిడిపి ఇమేజ్ తగ్గడం ప్రారంభమైందనే వాదనలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు అస్థిరపరిచే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత తెలంగాణ ద్రోహులనే టీఆర్ఎస్ చేర్చుకుందని అంటుంటారు.

భవిష్యత్తు చూసుకోవాల్సిందేనా

భవిష్యత్తు చూసుకోవాల్సిందేనా

నిన్నటి వరకు తెలంగాణలో టిడిపి అంటే రేవంత్ రెడ్డి గుర్తుకు వచ్చారు. అలాంటి నేత బయటకు వెళ్తే ఆ పార్టీ ఉనికి మరింత ప్రమాదంలో పడిందని అంటున్నారు. రేవంత్ తర్వాత మిగతా నేతలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే భవిష్యత్తును చూసుకోవాల్సిందేననే వాదనలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్‌తో పొత్తు ఆశలు

టీఆర్ఎస్‌తో పొత్తు ఆశలు

తెలంగాణలో వెలమ, కమ్మ సమీకరణాలను ఇష్టపడుతున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు.

టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా

టీడీపీకి కేసీఆర్ జీవం పోస్తారా

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు అంటే ఆ పార్టీకి కేసీఆర్ జీవం పోసినట్లు అవుతుందని అంటున్నారు. కాబట్టి టీడీపీకి జీవం పోసే పనిని కేసీఆర్ పెట్టుకోరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మరింత మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్, బీజేపీల వైపు చూసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that TRS chief and Telangana Chief Minister K Chandrasekhar Rao may not align with Telugu Desam Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి