DC vs RCB: ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు..! షాక్ లో అక్షర్ పటేల్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IP 2026)లో భాగంగా నిన్న ఢిల్లీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 75పరుగలకే ఆలౌటైంది. 76 పరుగుల స్వల్ప స్కోరును ఆర్సీబీ వికెట్ కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ఓటమితో ఢిల్లీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో నిలిచింది.

ఢిల్లీ గత మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 152 పరుగుల భారీ ఇన్నింగ్స్, నితీష్ రాణా 91 పరుగుల సాయంతో 265 పరుగులు స్కోరు చేసినా అదృష్టం కలిసి రాకపోవడంతో పంజాబ్ కింగ్స్ కు మ్యాచ్ ను సమర్పించుకుంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో కేవలం 75 పరుగులకే కుప్పకూలి అందరికీ షాకిచ్చింది. ఈ చెత్త ఓటమిపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) అసలు ఐపీఎల్ లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదన్నాడు.

Axar Patel Has No Answers for Delhi Capitals IPL Collapse I Don t Understand What s Happening

ఆర్సీబీ మ్యాచ్ లో ఏం జరిగిందో తనకే తెలియదని, క్రికెట్‌లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అక్షర్ పటేల్ తెలిపాడు. మనం ఈ ఓటములను మరిచి ముందుకు సాగాలన్నాడు. తాను కావాలనుకుంటే తప్పులు వెతకవచ్చని, కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు విషయాలను తేలికగా తీసుకోవడం మానుకోవాలని డీసీ కెప్టెన్ సలహా ఇచ్చాడు. పంజాబ్ తో మ్యాచ్ లో ఒక క్యాచ్ లేదా, జీటీ మ్యాచ్ లో ఒక పరుగు చేసి ఉంటే తమ జోరు కొనసాగి ఉండేదన్నాడు. కానీ అప్రమత్తంగా ఉండాలని, చేసే పనిలో నిలకడగా ఉండాలని జట్టు సహచరులకు సూచించాడు. ఐపీఎల్‌లో విషయాలను తేలికగా తీసుకోలేరన్నాడు. ఇది ఎంత కష్టమైన టోర్నీయే మీకు తెలుసన్నాడు. గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు వైపు చూడలేరని అక్షర్ తేల్చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+