సెకెండ్ ఫేస్ పోలింగ్ వేళ.. బెంగాల్ లో యూపీ ధురంధర్ ఐపీఎస్: రావడం రావడంతోనే

అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. 294 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ నెల 23న 152 స్థానాలక తొలి విడత పోలింగ్ ముగిసింది. మిగిలిన సీట్ల కోసం ఓటింగ్ జరుగనుంది. ఇది కీలకం. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటలుగా భావించే స్థానాల్లో పోలింగ్ జరుగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిస్థితుల మధ్య ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్'గా పేరుపొందిన అజయ్ పల్ శర్మ.. పశ్చిమ బెంగాల్ పోలింగ్ అబ్జర్వర్ గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి గట్టిపట్టు ఉన్న దక్షిణ 24 పరగణ జిల్లాల పరిశీలకుడిగా ఆయన వ్యవహరిస్తోన్నారు. నియామకం తర్వాత అజయ్ పాల్ శర్మ చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాలను సందర్శిస్తూ భద్రతను సమీక్షిస్తున్నారు.

Uttar Pradesh IPS Officer Ajay Pal Sharma takes a charge as Poll Observer for South 24 Parganas

టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్ మద్దతుదారులు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందగానే, భద్రతా బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అల్లర్లను అయినా సహించేది లేదని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లర్లు జరిగితే అంతు చూస్తానని, ఆ తర్వాత ఏడ్చి లాభం లేదనీ తేల్చి చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది. ఆయన నేతృత్వంలో ఎస్‌ఎస్‌బీ, ఎఫ్‌ఎస్‌టీ, క్యూఆర్‌టీ సంయుక్త బృందాలు జహంగీర్ ఖాన్ స్థావరాలపై దాడులు చేశాయి.

2011 బ్యాచ్ ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పల్ శర్మ. ఆయన స్వస్థలం పంజాబ్ లోని లూధియానా. కఠిన పనితీరుతో ఉత్తరప్రదేశ్ పోలీసులో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్తర్ ప్రదేశ్ లో అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలైన షామ్లీ, నోయిడా, జౌన్‌పూర్, రాంపూర్ జిల్లాల్లో పని చేశారు. ఆయన నిర్వహించిన పోలీస్ ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లు చర్చనీయాంశం అయ్యాయి ఇదివరకు.

అటువంటి అధికారిన దక్షిణ 24 పరగణాలలో నియమించడం పట్ల టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ నిజంగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అవసరం ఉందా? అని ప్రశ్నించింది. అఖిలేష్ యాదవ్ కూడా ఈ నియామకంపై సందేహాలు వ్యక్తం చేశారు. అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడు జహంగీర్ ఖాన్. ఆయనను అజయ్ పల్ శర్మ స్వయంగా హెచ్చరించడంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+