వాము... 100 రోగాలను తగ్గించే డాక్టర్
కడుపునకు సంబంధించి ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటిని తగ్గించే ఏకైక నివారిణి వాము. మన వంటింటిలోనే ఉంటుంది. మన వంటిల్లే మన వైద్యశాల. వాము గింజల్లో యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటివల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, అపాన వాయువు, అజీర్ణం వంటి దీర్ఘకాలిక కడుపు సమస్యలను పరిష్కరించడంలో ఓమమ్ గింజలు సహాయపడతాయి. వాము విత్తనాలు పేగు , కడుపు పుండు సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడేస్తుందని తాజాగా జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.
కడుపునొప్పితో బాధపడేవారు 100 గ్రాముల వామును 1 లీటరు నీటిలో మరిగించి, అవి సగానికి తగ్గిన తర్వాత తాగితే కడుపు నొప్పితోపాటు కడుపునకు సంబంధించిన ఇతర సమస్యలన్నీ తగ్గిపోతాయి. 35 గ్రాముల వాము, మిరియాలను తీసుకుని బాగా గ్రైండ్ చేస్తే అందులో 35 గ్రాముల తాటి బెల్లం వేసి 5 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకుంటుండాలి.

కొందరికి ఎప్పుడూ దగ్గు, గొంతులాంటివి వస్తుంటాయి. ఉదయం, సాయంత్రం వాము చూర్ణం తీసుకుంటే ఇవి తగ్గుతాయి. ఒక చెంచా వామును కొన్ని నీళ్లలో మరిగించి, 100 మిల్లీలీటర్ల కొబ్బరినూనె వేసి మళ్లీ మరిగించి ఫిల్టర్ చేయాలి. తర్వాత ఈ నీటిని వడగట్టాలి. అందులో కర్పూరం పొడిని వేసి నడుముపై బాగా రుద్దితే నొప్పి తగ్గిపోతోంది. వామునీరు రెగ్యులర్ గా తీసుకోవడంవల్ల బరువు తగ్గుతారు.
చిన్నపిల్లల్లో అజీర్తి చేస్తుంది. అలసిపోవడంవల్ల వారికి అలా అవుతుంది. వామును మెత్తగా నూరి మజ్జిగలో కలిపిఇస్తే వెంటనే తగ్గిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే మంచి నిద్ర, మంచి ఆకలి అని అర్థం. ఆకలి, నిద్ర వల్ల శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది. ఆకలిని తగ్గించడానికి, కడుపునకు సంబంధించిన సమస్యలను నయం చేయడానికి వామును కషాయం చేసి తాగాలి.












Click it and Unblock the Notifications