ప్రతి రోజూ ఇవి 4 గింజలు తింటే.. క్యాన్సర్, గుండె సమస్యలకు చెక్.. !
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. హోటళ్లు, రెస్టారెంట్స్ లో నాణ్యతలేని ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్, ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్ వంటివాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే ప్రతి రోజూ ఈ గింజలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడొచ్చని వైద్యులు వివరిస్తున్నారు.
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పక తీసుకోవాల్సిందే. బాదం పప్పులో పోషకాలు అమోఘం. ప్రతి రోజూ వీటిని తినడం వల్ల అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. బాదంలో రిబోఫ్లేవిన్, ఎల్ కార్నిటైన్ అనేవి అధికంగా ఉంటాయని అవి మెదడు పనితీరును మెరుగు చేస్తాయని చెబుతున్నారు. అలాగే న్యూరోడీజనరేటివ్ వ్యాధులైన అల్జీమర్స్ లాంటివి రాకుండా బాదం కాపాడుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు.

అలాగే బాదంలో ఆరోగ్యకరమైన మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు నాలుగు బాదం తీసుకోవడం ద్వారా గుండెకు మంచిదని, క్యాన్సర్ వ్యాధులు రావని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి బాదంపప్పులు బాగా సహకరిస్తాయట.
అంతేకాక జబ్బుల బారిన పడకుండా బాదంపప్పులు సహాయపడతాయని.. యాంటీ ఆక్సిడెంట్లు అయిన విటమిన్ ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే బాదంలో ఉండే కాల్షియం, పాస్పరస్ లు ఎముకల బలానికి బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ ఎముకల సాంద్రతను పెంచి గాయాల నుంచి రక్షిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications