నిమ్మ తొక్కలు పడేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే తొక్కలే కావాలంటారు​!

నిమ్మకాయ రసం తీసిన తర్వాత మిగిలిన తొక్కలను చాలా మంది నేరుగా డస్ట్‌బిన్‌లో వేసేస్తుంటారు. కానీ ఆ తొక్కలు నిజానికి చాలా విలువైనవి. వీటిని సరైన విధంగా ఉపయోగిస్తే ఇంటి శుభ్రత, వంటింటి సమస్యలు, దుర్వాసనలు తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కల్లో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల అవి సహజమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తాయి. రసాయనిక క్లీనర్లకు బదులుగా ఈ సహజపద్ధతులు ఆరోగ్యానికి మంచివి.

నిమ్మ తొక్కలతో ఈ లాభాలు

బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లు కట్ చేసినప్పుడు చేతులు రంగు మారిపోతాయి. ఆ మరకలు సాధారణ సబ్బుతో తొలగడం కష్టం. అయితే నిమ్మ తొక్కలతో చేతులను బాగా రుద్దుకుంటే మరకలు సులభంగా తొలగిపోతాయి. ఇది చర్మాన్ని మెత్తగా కూడా ఉంచుతుంది.

Amazing Cleaning Benefits Of Using Lemon Peels For Home know the complete hacks with lemon peel

కిచెన్ సింక్, షూస్ అన్నిటినీ శుభ్రం చేసే నిమ్మతొక్కలు

ఇంట్లో ఉండే స్టీల్ సింక్ త్వరగా జిడ్డుగా మారుతుంది. నిమ్మ తొక్కలు మరియు డిష్ వాష్ లిక్విడ్‌తో రుద్దితే జిడ్డు పోయి, దుర్వాసన కూడా తొలగిపోతుంది. సింక్ తళతళా మెరుస్తుంది. చెమట వల్ల షూస్‌లో దుర్వాసన వస్తుంది. ఎండబెట్టిన నిమ్మ తొక్కలను షూస్‌లో ఉంచితే దుర్వాసన తగ్గి, సువాసన వస్తుంది. ఇది సులభమైన మరియు సహజమైన పరిష్కారం.

దుస్తుల మరకలు పోవాలంటే నిమ్మతొక్కల మంత్రం

టవల్స్ లేదా దుస్తులపై పట్టుకుపోయిన మరకలు తొలగించడానికి నిమ్మ తొక్కలు, బేకింగ్ సోడా మంచి కాంబినేషన్. బకెట్‌లో నిమ్మ తొక్కలు, బేకింగ్ సోడా వేసి నీళ్లు పోసి దుస్తులను నానబెట్టి ఉతికితే మరకలు పోతాయి. కూరగాయలు కట్ చేసే బోర్డు త్వరగా మురికి అవుతుంది. నిమ్మ తొక్కలను ఉప్పులో ముంచి బోర్డును రుద్దితే మురికి, దుర్వాసన తొలగి నీట్ గా ఉంటుంది.

బాత్‌రూమ్ నే కాదు ఆల్ పర్పస్ క్లీనింగ్ కు నిమ్మ తొక్కలు

టైల్స్‌పై సబ్బు మరకలు, ట్యాప్‌లపై జిడ్డు తొలగించడానికి నిమ్మ తొక్కలు, వెనిగర్ మిశ్రమం ఉపయోగించవచ్చు. రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు స్ప్రే చేసి క్లీన్ చేస్తే బాత్‌రూమ్ తాజాగా ఉంటుంది. గుప్పెడు నిమ్మ తొక్కలతో పాటు వైట్ వెనిగర్ తీసుకుని 2-3వారాలు నానబెట్టి, తర్వాత నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఇంటిఅద్దాలు, టేబుల్, పొయ్యి చుట్టుపక్కల, తలుపులు శుభ్రం చేయడానికి ఈ మిశ్రమం చాలా బాగా పని చేస్తుంది.

చికెన్ ప్రియులకు హెచ్చరిక.. చికెన్ లో ఈ భాగాలు అసలే తినొద్దు!
చికెన్ ప్రియులకు హెచ్చరిక.. చికెన్ లో ఈ భాగాలు అసలే తినొద్దు!

మైక్రోవేవ్ ఓవెన్ శుభ్రం

మైక్రోవేవ్‌లో నీళ్లు నింపిన బౌల్‌లో నిమ్మ తొక్కలు వేసి 5 నిమిషాలు హీట్ చేస్తే ఆవిరి లోపలంతా వ్యాపించి మురికి సులభంగా తొలగిపోతుంది. నిమ్మ తొక్కలు వ్యర్థం చేయకుండా ఇలా ఉపయోగించడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. రసాయనికాలు లేని సహజ శుభ్రత సాధించవచ్చు. ఇవి చిన్న చిన్న టిప్స్ కానీ రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+