ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!!
ఉసిరి ఓ అద్భుతమైన హోమ్ మెడిసిన్. చాలినంత విటమిన్ సీ ఉంటుంది ఇందులో. రోజూ దీన్ని ఉసిరి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. కళ్లకు ఉసిరి చాలా ప్రయోజనకారి. రోజూ ఒక ఉసిరి కాయ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ సీ సులభంగా అందుతుంది. ఉసిరి కాయలు దొరకని సమయంలో ఒక టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగినా కూడా అదే ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి.
ఉసిరి విటమిన్ సీ తో పాటు ఏ, బీ కాంప్లెక్స్, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలతో కూడిన సూపర్ ఫుడ్ ఇది. పచ్చళ్లు, చట్నీలు, జామ్‌ల రూపంలో ఇంటింటా ఉసిరిని వాడతారు. చలికాలంలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అందుకే ఈ సమయంలో నిత్యం ఉసిరి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ప్రతిరోజూ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపు సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

ఉసిరిలో అధిక విటమిన్ సీ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. తద్వారా జలుబు, ఫ్లూ, ఇతర అంటువ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది దృష్టిని మెరుగుపర్చుతుంది. క్యాల్షయం ప్రభావం వల్ల ఎముకలు కూడా బలోపేతమౌతాయి. పొలుసుబారకుండా ఉంటాయి. ఉసిరి పొడి పీచు పదార్థానికి గొప్ప వనరు. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి, ఉసిరి పొడిని నీటితో తీసుకోవడం మంచి ఎంపిక. ఇది శరీర కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది. జుట్టు, చర్మపు కాంతి కోసం ఉసిరిని సేవించండి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేస్తాయి. రోజూ ఉసిరి తినడం వల్ల ముఖానికి మెరుపునిస్తుంది, మచ్చలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఉసిరి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే గుణాలు ఉండటంతో మానసిక ఆరోగ్యానికి మేలు. యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఉసిరి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరి కలిపిన గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించడం తక్షణ శక్తినిస్తుంది. ఇది అలసటను తగ్గించి, రోజంతా చురుకుగా ఉంచే పోషకాలను అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది.












Click it and Unblock the Notifications