ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మార్పుల ప్రకారం కేరళం, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిలో కొందరిని బదిలీ చేయగా.. మరికొందరిని కొత్తగా నియమించినట్లు తెలుస్తోంది. ఇక కేరళం ప్రథమ పౌరుడిగా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌.. తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌ గా నియమితులయ్యారు. అలాగే సిక్కింలో సేవలందించిన ఓమ్ ప్రకాశ్ ముథుర్ కేరళం నూతన గవర్నర్‌ గా వ్యవహరించనున్నారు.

ఇక ఒడిశాకు బ్రజ్ మోహన్ రామ్ నూతన గవర్నర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే కర్నాటకకు కొత్త గవర్నర్ గా సుధా యాదవ్ పదవి స్వీకరించనున్నారు. అటు ఉత్తారాఖండ్‌ కు ధాల్ సింగ్ బైసెన్ నూతన గవర్నర్ గా ఎంపికయ్యారు. ఇక సిక్కింకు దుష్యంత గౌతమ్ గవర్నర్‌ గా నియామకం అయ్యారు. ఓవైపు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న వేళ రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ నియామకాలు సంబంధిత వ్యక్తులు తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

governors new Appointment of new governors for six states President issues orders governors latest

ఈ ఆరు రాష్ట్రాల్లో పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుభవం కలిగిన నేతలకు సర్వోన్నత రాజ్యాంగ పదవులను అందించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మార్పులు దోహదపడతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ గవర్నర్లు తమ కొత్త రాష్ట్రాల్లో బాధ్యతలను అధికారికంగా స్వీకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+