స్మోకీ ఫ్లేవర్ వంకాయ బజ్జి పచ్చడి.. ఇలా చేస్తే మాములుగా ఉండదు!

మనం ఆహారంలో తినే కూరలు, పచ్చళ్ళు ఏవైనా సరే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే మనం ఆరోగ్యం కోసం మాత్రమే కాక, రుచి కోసం కూడా రకరకాలుగా వంటలు చేసుకుంటాం. ప్రస్తుతం మనం వంకాయలను కాల్చి స్మోకీ ఫ్లేవర్ వంకాయ బజ్జీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా వంకాయ బజ్జీ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. మరి వంకాయ బజ్జీ పచ్చడి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

వంకాయ బజ్జీ పచ్చడికి కావాల్సిన పదార్ధాలు

గుండ్రని వంకాయలు పెద్దవి- 3

పచ్చిమిర్చి -- 8

కొత్తిమీర -- ఒక కట్ట

చింతపండు -- నిమ్మకాయంత

పసుపు -- కొద్దిగా

ఉప్పు -- తగినంత .

పోపునకు .

నూనె -- మూడు స్పూన్లు

ఎండుమిరపకాయలు --- 6

మినపప్పు -- స్పూను

ఆవాలు -- అర స్పూను

జీలకర్ర -- పావు స్పూను

ఇంగువ -- కొద్దిగా

Andhra Style Vankaya Bajji Pachadi Indoor Smoky Brinjal Chutney Recipe Making Process at Home

తయారీ విధానము

ముందుగా వంకాయలు పుచ్చు లేకుండా చూసుకుని పైన నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టి అన్ని వైపులా కాల్చుకుని చల్లారగానే నీళ్ళ తడి చేతితో పై తొక్క మరియు తొడిమ తీసుకుని వేరే ప్లేటులో లోపల గుజ్జు పెట్టుకోవాలి. వీటి పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి .చింతపండు విడదీసి నీళ్ళలో తడుపు కోవాలి .

రోట్లో వేసి ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా పచ్చి మిర్చి వేయించుకోవాలి, తర్వాత ఎండుమిర్చి ముక్కలు గా చేసి , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .పోపు చల్లారగానే ముందుగా రోటిలో ఎండుమిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా దంచుకోవాలి.

వంకాయ బజ్జీ పచ్చడి ఇందులో బెస్ట్

తర్వాత పచ్చిమిరపకాయలు ,కాల్చిన వంకాయలు , మిగిలిన పోపు మరియు కొత్తిమీర కూడా వేసి మరీ మెత్తగా కాకుండా బండతో నూరుకోవాలి. దీంతో వంకాయ బజ్జీ పచ్చడి రెడీ అయింది .అంతే . దోశెలు , చపాతీలు, అన్నం లోకి వంకాయ బజ్జీ పచ్చడి చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+