UPI MDR: తేల్చేసిన నిర్మలమ్మ! పన్ను కాదు, సెస్ అసలే కాదు.. పూర్తిగా ఫ్రీ

యూపీఐ లావాదేవీలపై పన్నులు,సెస్ లు విధిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఐ వినియోగిస్తున్న సామాన్య ప్రజలపై ఎలాంటి రుసుముల భారం పడదని, డిజిటల్ చెల్లింపులు మునుపటిలాగే ఉచితంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

మార్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది కేవలం సేవా నిర్వాహకుల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉద్దేశించిన రుసుము మాత్రమేనని, దీనిని సాధారణ వినియోగదారుల నుంచి వసూలు చేయబోరని తేల్చిచెప్పారు. విపక్షాలు ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు.

UPI Payments Remain Absolutely Free for Customers Says Finance Minister Nirmala Sitharaman On MDR Charges

రూ. 2,000 దాటితేనే.. అదీ పన్ను కాదు!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం, రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే పర్సన్-టు-మార్చంట్ (P2M) లావాదేవీలపై మాత్రమే 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. "ఇది పన్ను (Tax) కాదు, సెస్ (Cess) అసలే కాదు. ఈ రుసుము ద్వారా వచ్చే సొమ్ము భారత సంచిత నిధికి చేరదు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత భద్రంగా, బలంగా తీర్చిదిద్దడానికి బ్యాంకులు, పేమెంట్ యాప్ నిర్వాహకుల మధ్య జరిగే ఆర్థిక సర్దుబాటు ఇది" అని వెల్లడించారు. చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు చేసే దాదాపు 96 శాతం లావాదేవీలపై ఈ నిబంధన ప్రభావం ఉండదని, పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలు ఎప్పటిలాగే రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఉచితమని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో చెప్పినా వైఖరి మారలేదు: సీతారామన్

యూపీఐ రుసుములపై ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రమైన వివరణ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. వాస్తవాలను దాచిపెట్టి, లేని అంశాలపై గందరగోళం సృష్టించి ప్రభుత్వాన్ని నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి తప్పుడు కథనాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ తీరుపై నిప్పులు.. రాహుల్ గాంధీ ప్రోత్సహించడం సరికాదు!

ఇటీవల ఇండోర్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమంలో రాజ్యాంగబద్ధమైన పదవులను హేళన చేస్తూ ప్రదర్శించిన మిమిక్రీపై నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవుల పట్ల కనీస గౌరవం లేకుంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+