Video: అమ్మ ప్రేమ ముందు ఓడిన నది.. కన్నీళ్లు తెప్పించే తల్లి ఏనుగు ఆవేదన!

అది ఆర్తనాదాలు మిన్నంటిన క్షణం.. ఉగ్రరూపం దాల్చిన నది మరణ మృదంగం వాయిస్తోంది! ఉరకలెత్తుతున్న వరద నీరు గట్టును దాటి ప్రవహిస్తుంటే, ఆ ప్రవాహాన్ని దాటేందుకు ఓ ఏనుగుల గుంపు తీవ్రంగా శ్రమిస్తోంది. అంతలోనే విధి విసిరిన పంజాలా ఒక భారీ అల విరుచుకుపడింది! గుంపు నడుమ ఉన్న కేవలం నాలుగు రోజుల పసికూన అయిన ఏనుగు పిల్ల, ఆ ఉధృతికి ప్రవాహంలో కొట్టుకుపోయింది. తల్లి ఏనుగు ఆవేదనతో ఘీంకరించినా, పొంగిపొర్లుతున్న వరదను ఎదురించి బిడ్డను కాపాడుకోలేక ఒడ్డున విలవిలలాడింది. నది రాకాసి ప్రవాహంలో ఆ పసి ప్రాణం ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర కొట్టుకుపోతూ, ప్రతి క్షణం చావుబతుకుల మధ్య పోరాటం సాగించింది!

మరోవైపు నదిలో కొట్టుకుపోతూ, నీళ్లలో మునిగిపోతున్న ఆ చిన్నారి గజాసురుణ్ణి గమనించిన స్థానిక మత్స్యకారుల గుండెలు తల్లడిల్లిపోయాయి. క్షణం ఆలస్యమైనా ఆ పసి ప్రాణం నది ఒడిలోనే కలసిపోతుందని గ్రహించారు. ఏ మాత్రం ఆలోచించకుండా, సొంత ప్రాణాలను సైతం పణంగా పెట్టి చిన్న పడవలో ఉప్పొంగుతున్న నదిలోకి దూసుకెళ్లారు!

Heartwarming Rescue Drowning Baby Elephant Saved From Teesta River and Reunited With Mother Elephant

నది అలలతో పోరాడుతూ, ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్న ఏనుగు పిల్లను అతి కష్టం మీద పడవలోకి లాక్కొచ్చారు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, బైకాంత్‌పూర్ డీఎఫ్‌ఓ ముదిత్ కుమార్ నేతృత్వంలోని బృందం క్షణాల మీద అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించింది. అదృష్టవశాత్తూ ఆ పసిపిల్లకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

53 ఏళ్ల ఏనుగు విమానమెక్కిన వేళ.. దేశ చరిత్రలోనే తొలిసారి
53 ఏళ్ల ఏనుగు విమానమెక్కిన వేళ.. దేశ చరిత్రలోనే తొలిసారి

కన్నీళ్లు తెప్పించే తల్లి ప్రేమ సీన్!

అయితే అసలైన సవాలు ఇక్కడే మొదలైంది! మనుషుల వాసన ఎక్కువసేపు తగిలితే తల్లి ఏనుగు ఆ పిల్లను తన బిడ్డగా అంగీకరించక తిరస్కరించే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు అత్యంత వేగంగా, పక్కా ప్రణాళికతో ఏనుగుల గుంపు ఉన్న గజాల్‌డోబా అటవీ ప్రాంతానికి ఆ పసికూనను తీసుకెళ్లారు. కళ్లెదుటే నదిలో కొట్టుకుపోయిన బిడ్డను చూసి దిక్కుతోచని స్థితిలో ఆవేదనతో రగిలిపోతున్న తల్లి ఏనుగు ముందర ఆ పిల్లను ఉంచారు.

ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్

కళ్లముందు తనన బిడ్డను చూడగానే ఆ తల్లి ఏనుగు పొందిన ఆనందానికి హద్దులు లేవు! సినిమా చివర్లో వచ్చే స్లో ఎమోషన్ తో వచ్చి, ప్రేమగా నిమిరి, తన బిడ్డకు పాలు ఇచ్చి గుండెలకు హత్తుకుంది. చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ తల్లి ఒడికి చేరిన ఆ దృశ్యం చూసి అటవీశాఖ అధికారులు, మత్స్యకారులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+