4F.. ఐరాస భద్రతమండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం- గట్టి మద్దతు

అమెరికా న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా 'పార్ట్‌నర్స్ ఫర్ మల్టీలేటరలిజం అంశంపై ప్రత్యేక సెమినార్ ఏర్పాటైంది. దీనికి భారత్ కో స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ సదస్సులో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చీఫ్ ఆంటోనియో కోస్టా సహా వివిధ దేశాల ప్రతినిధులు ప్రారంభోపన్యాసం ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే ప్రతిపాదన ఈ సర్వసభ్య సమావేశంలోనే చర్చకు రానుంది. ఈ ప్రతిపాదనలకు నాలుగు యూరప్ దేశాలు మద్దతు ప్రకటించాయి కూడా. ఈ విషయంలో హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ ముందుకొచ్చాయి. గ్లోబల్ సౌత్‌లో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదుగుతున్న అగ్రరాజ్యం భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలనే తీర్మానంతో తాము ఏకీభవిస్తున్నామని స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ అన్నారు.

Fresh Boost for India at UN V4 Countries Endorses Permanent Security Council Seat during 81st UNGA

భద్రతా మండలి ఏర్పాటు చేసిన 1945 నాటి ప్రపంచ రాజకీయ స్థితిగతులు, నేటి పరిస్థితులకు చాలాతేడా ఉంది. ఐరాస ఆవిర్భవించినప్పుడు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాలు విదేశీ వలస పాలన కింద ఉన్నాయి. కాలక్రమేణా ప్రపంచంలో అతి పెద్ద జనాభాతో పాటు దౌత్యపరంగా ఎదిగి, ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో అపారమైన సేవలందించిన భారత్ లాంటి దేశాలకు నేటికీ ఐరాసలో తగిన భాగస్వామ్యం దక్కట్లేదు.

తిరుమలలో అరుదైన ఘట్టం: తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేర్లతో.. !!
తిరుమలలో అరుదైన ఘట్టం: తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేర్లతో.. !!

ఇప్పటివరకు ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్య దేశంగా భారత్ కీలక పాత్ర పోషించింది.. భద్రతమండలిలో. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్ జీ4 గా ఏర్పడి భద్రతా మండలిలో సమూల మార్పుల కోసం ఒత్తిడి తెస్తోన్నాయి. ప్రస్తుతం మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాల మధ్య ఈ సంస్కరణలపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. ముఖ్యంగా బీజింగ్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం భారత్ అభ్యర్థనపై స్పష్టమైన వైఖరి తీసుకోవట్లేదు. వీటో అధికారాల వంటి అనేక అంశాలలో ఆయా దేశాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది.

ట్రంప్ తగ్గేదే లేదు: మీడియాలో పాజిటివ్ కవరేజ్ లేదని ఏకంగా టీవీనే లాంచ్ చేశాడు
ట్రంప్ తగ్గేదే లేదు: మీడియాలో పాజిటివ్ కవరేజ్ లేదని ఏకంగా టీవీనే లాంచ్ చేశాడు

ప్రస్తుతం ఈ అయిదు శాశ్వత సభ్య దేశాలు భద్రతామండలి తీసుకునే కీలక నిర్ణయాలను అడ్డుకోగలవు. ఎన్నికైన సభ్య దేశాలకు ఆ అధికారం లేదు. వీటో అధికారం తొలగించాల్సిన అవసరం ఉందంటూ ఇదివరకు ఆఫ్రికన్ యూనియన్ వాదించింది గానీ అది వాస్తవ రూపాన్ని దాల్చట్లేదు. భద్రతమండలిలో నూతనంగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకు కూడా అవే అధికారాలు దక్కాలనేది ఆఫ్రికన్ యూనియన్ వాదన. భారత్ కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తోంది.

ట్రంప్ వ్యవహారంపై రంగంలో దిగిన ఐక్యరాజ్యసమితి..!!
ట్రంప్ వ్యవహారంపై రంగంలో దిగిన ఐక్యరాజ్యసమితి..!!

కాగా.. .. ఈ సెమినార్ లో జైశంకర్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య తలెత్తుతోన్న పోటీ.. అంతర్జాతీయ భాగస్వామ్య సహకార వ్యవస్థను దెబ్బతీస్తోన్నాయని అన్నారు. దీన్ని పునరుద్ధరించడానికి బహుముఖ వ్యూహాలను అనుసరించడం, వాటిని ఉమ్మడిగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు దీని స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశాయని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో అమెరికన్ కంపెనీ భారీ ప్రాజెక్ట్- దేశంలోనే మొదటిది
తమిళనాడులో అమెరికన్ కంపెనీ భారీ ప్రాజెక్ట్- దేశంలోనే మొదటిది

భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థిక రంగాల్లోని సంక్షోభాలను (4F Crisis - Fuel, Food, Fertilizer, Finance) చురుగ్గా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని జైశంకర్ సూచించారు.

వీటిని పట్టించుకోకపోతే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటాయని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న సాంకేతిక విప్లవం, మార్పులకు అనుగుణంగా అవసరమైన భద్రతా చట్రాలు, సంరక్షణ నియంత్రణలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క దేశమో ఏకఛత్రాధిపత్యం వహించకుండా నిరోధించడానికి ప్రపంచం ఏకతాటిపైకి రావాలని, ఒకే విధమైన ఆలోచనలు, ఆశయాలు కలిగిన కలిగి ఉండాలని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+