నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండుకుని తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి!
మన దేశంలో చాలామంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. శాకాహారం తినే వాళ్ళ కంటే మాంసాహారం తినేవాళ్ళ సంఖ్యనే మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. అయితే నాన్ వెజ్ ఆహారాన్ని తినేవారు నాన్ వెజ్ కూరలను కలుపుకునేటప్పుడు అందులో నిమ్మకాయ పిండుకుని తింటారు. అయితే నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండుకొని తినడం మంచిదేనా?
నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండితే జరిగేదిదే
నాన్ వెజ్ ఆహారంలో నిమ్మకాయ పిండుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం. అయితే నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారంలో నిమ్మకాయను పిండుకొని తినడం కొంతమేర మంచిదే. నిమ్మకాయలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి అందులో ఉండే పులుపుదనం మాంసం పై పడినప్పుడు దాని రుచి పెరుగుతుంది.

మాంసంలో నిమ్మకాయ పిండితే ప్రయోజనాలు ఇవే
అందుకే చాలామంది నాన్ వెజ్ తినేటప్పుడు కచ్చితంగా నిమ్మకాయను పిండుకుంటారు. నిమ్మకాయలలో ఉండే విటమిన్ సి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మాంసం తొందరగా జీర్ణం కాదు కాబట్టి అందులో నిమ్మకాయ పిండుకుని తింటే త్వరగా జీర్ణం అవుతుంది. ఇక నిమ్మకాయలలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మాంసంలో బ్యాక్టీరియాని చంపి మన శరీరానికి మేలు చేస్తాయి.
మాంసాహారంలో నిమ్మకాయను పిండుకుని తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారి నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అయితే ఎవరైనా సరే మాంసాహారంలో నిమ్మకాయను పిండుకుని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా నిమ్మకాయలోని పులుపు మాంసానికి రుచిని పెంచుతుందని ఎక్కువగా నిమ్మకాయలను పిండకూడదు. దీంతో ఆహారం పుల్లగా మారి, ఆ పులుపుదనం ఎక్కువైతే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని.. జాగ్రత్త
అదేవిధంగా తాజాగా లేని మాంసం పైన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితులలోనూ పిండకూడదు. ఫ్రెష్ గా లేని మాంసంపైన నిమ్మకాయ పిండడం, దానిని తినడం మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది మన శరీరానికి హాని చేస్తుంది. కనుక మాంసాహారాన్ని తీసుకునేవారు ముఖ్యంగా నిమ్మకాయలను పిండుకొని తినే విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదు మించిన నిమ్మరసం మాంసంలో పిండటం ఏ మాత్రం మంచిది కాదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications