చుక్కకూర మటన్ కర్రీ సూపర్ టేస్ట్.. ఇలా చేస్తే అన్నం మెతుకు కూడా వదిలిపెట్టరు
చుక్కకూర మటన్ చాలా రుచికరమైన, తేలికపాటి ఆహారం. మటన్ ను చుక్కకూరతో కలిపి వండితే అది పులుపు రుచితో ఉండే సాంప్రదాయ వంటకంగా చాలా బాగుంటుంది. రొటీన్ మటన్ కర్రీకి భిన్నంగా చుక్కకూర మటన్ కూర ఇలా వండి ట్రై చెయ్యండి.
కావలసిన పదార్థాలు
మటన్ – 500 గ్రాములు
చుక్కకూర – ఒక పెద్ద కట్ట( శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నది)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు – 2
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
మిరప పొడి – 1 స్పూన్
పసుపు – అర స్పూన్
ఉప్పు – తగినంత
గరం మసాలా – అర స్పూన్
నూనె – 3 స్పూన్లు

తయారీ విధానం
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి, నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాలి తరువాత టమాటాలు,వేసి ఉడికించాలి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి.
ఇలా వండితే చుక్కకూర, మటన్ బాగుంటుంది
ఆపై అందులో పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆపై అందులో గరం మసాలా, చుక్కకూర కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే దాకా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్ విజిల్ పదిలిన తర్వాత మూత తీసి, అందులో కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
డిఫరెంట్ టేస్ట్ కావాలంటే ఇలా చెయ్యండి
కూర బాగా అయిందని భావిస్తే స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నంలో గానీ, రోటీలో గానీ సర్వ్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. ఈ కూర చుక్కకూర వేయటం వలన పుల్లటి రుచితో చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా వండుకుంటే డిఫరెంట్ రుచులు చూసినట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications