హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!
మటన్ దాల్చా.. చాలా ప్రోటీన్ ఉన్న మంచి పోషకాహారంగా మటన్ దాల్చా ను చెబుతారు. భారతదేశంలో తయారు చేయబడే అత్యంత పోషకాలు ఉండే ఆహారంలో మటన్ దాల్చా ఒకటి. ఇక అటువంటి మటన్ దాల్చా ను హైదరాబాదీ స్టైల్ లో చేస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనం హైదరాబాదీ స్టైల్ మటన్ దాల్చా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు
మటన్- 500 గ్రాములు
శనగపప్పు- అర కప్పు
కందిపప్పు- అరకప్పు
సొరకాయ- కట్ చేసుకున్న ముక్కలు
ఉల్లిపాయ- ఒకటి కట్ చేసుకున్న ముక్కలు
టమాటాలు- రెండు కట్ చేసుకున్న ముక్కలు
అల్లం వెల్లుల్లి- ఒక స్పూన్
గరం మసాల- ఒక స్పూన్
బిర్యానీ ఆకులు రెండు
చింతపండు- 20 గ్రాములు రసం తీసినది
పచ్చిమిర్చి- నాలుగు
పసుపు -అర స్పూన్
ఉప్పు- రుచికి సరిపడినంత
దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క
యాలుకలు- మూడు
లవంగాలు- మూడు
షాజీరా- హాఫ్ టీ స్పూన్
కొత్తిమీర కొద్దిగా
నూనె -మూడు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా శనగపప్పు, కందిపప్పు లను కడిగి తగినన్ని నీళ్లు పోసి చిటికెడు పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో నూనె వేడి చేసి మసాలా దినుసులు వేసి, ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసి మగ్గించాలి. తర్వాత అందులో మటన్ ముక్కలు, పసుపు ,కారం, ధనియాల పొడి, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి మటన్ నూనెలో బాగా వేగే వరకు ఉడికించుకోవాలి.
మటన్ దాల్చా ఇలా చేస్తే సూపర్ టేస్ట్
దాదాపు 15 నిమిషాల పాటు మటన్ ను వేయించుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మటన్ మెత్తబడే వరకు నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పు, సొరకాయ ముక్కలు, చింతపండు పులుసు, గరం మసాలా, కొద్దిగా నీళ్లు వేసి సొరకాయ ముక్కలు మెత్తబడే వరకు దాల్చాని ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దించుకోవాలి.
ఇవి కూడా వేస్తే మటన్ దాల్చా బాగుంటుంది
కావాలంటే దీనిని మళ్లీ తాలింపు కూడా చేసుకోవచ్చు. అయితే సహజంగా చాలామంది మటన్ దాల్చాలో సొరకాయ ముక్కలు మాత్రమే వేస్తారు. మరింత రుచి కావాలనుకుంటే మునక్కాయలు, ఒక వంకాయ వేసి చూడండి. మటన్ దాల్చా అదిరిపోతుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications