శనగపప్పు పాయసం ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే.. అసలే వదిలిపెట్టరు!
శనగపప్పు పాయసం ఒక మంచి సంప్రదాయబద్ధమైన స్వీట్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పండుగలు, వ్రతాలకు చాలామంది ఈ పాయసాన్ని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం బెల్లంతో ఎంతో రుచికరంగా తయారుచేసే ఈ పాయసాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
శనగపప్పు – ఒక కప్పు
సగ్గుబియ్యం- పావు కప్పు
బెల్లం – ఒకటిన్నర కప్పు
పాలు – రెండున్నర కప్పులు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
యాలుకల పొడి – 1/2 టీస్పూన్
జీడిపప్పు – 10-12
కిస్మిస్ – 10
బాదంపప్పు- 10

తయారు చేసే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఆ పాన్ లో ఒక కప్పు శనగపప్పు వేసి లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించాలి. ఆ తర్వాత అందులో పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేసి నిదానంగా వేయించాలి. ఆ తర్వాత అందులో మూడు గ్లాసులు నీళ్ళు పోసి గంట పాటు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో ఈ మిశ్రమాన్ని నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
బెల్లం వేసే సమయంలో ఇలా చెయ్యండి
కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత పప్పు మాషర్ తో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి ఉడుకుతున్న పప్పులో మూడు కప్పుల పాలు పోయాలి. మళ్లీ నిదానంగా పప్పును పాలను కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత, మళ్లీ స్టవ్ ఆన్ చేసి నిదానంగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
శనగపప్పు పాయసంలో ఇవి వేస్తే సూపర్ టేస్ట్
ఇందులో యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆపై వేరే పాన్ లో నెయ్యి వేసి, నెయ్యి వేడి అయిన తర్వాత డ్రైఫ్రూట్స్ ని ఫ్రై చేసి ఈ శనగపప్పు పాయసంలో కలుపుకోవాలి. అంతే రుచికరమైన శనగపప్పు పాయసం రెడీ అవుతుంది. ఇది ఫెస్టివల్ టైం లో కానీ, ఎవరైనా స్నేహితులు ఇంటికి వచ్చిన సమయంలో కానీ చేసి పెడితే చాలా వెరైటీగా ను, రుచిగానూ ఉంటుంది.












Click it and Unblock the Notifications