ఉడుపి స్టైల్​ 'మిరియాల చారు'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..

చలికాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గేందుకు మిరియాల చారు చాలామంది తయారు చేసుకుంటారు. మిరియాల చారు చాలా టేస్టీగానే కాకుండా జీర్ణక్రియను పెంపొందించడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఘాటుగా టేస్టీగా ఉండే ఉడుపి స్టైల్​ 'మిరియాల చారు' ఎప్పుడైనా ట్రై చేశారా..? టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటివి కూడా అవసరం లేకుండా చాలా సింపుల్ గా ఈ చారును తయారీ చేసుకోవచ్చు. మిరియాల చారును ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

ఉడుపి స్టైల్​ 'మిరియాల చారు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మిరియాలు ఒక టేబుల్​ స్పూన్, ఎండుకొబ్బరి తురుము రెండు టేబుల్​ స్పూన్ లు, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, జీలకర్ర అర టీ స్పూన్, మినప్పప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్, నెయ్యి కొద్దిగా, పసుపు అర టీస్పూన్, రాళ్ల ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి.

'మిరియాల చారు' తయారీ విధానం చూస్తే.. ముందుగా చింతపండును ఓ గిన్నెలో నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మిరియాలను వేసి వేయించుకోవాలి. అందులో మినప్పప్పు, ధనియాలు వేసి తక్కువ మంటపై ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి. చివరగా ఎండుకొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన మిరియాల మిశ్రమం, నీళ్లు వేసుకోవాలి. కాస్త బరకగా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు గుజ్జును తీయాలి. ఇప్పుడు రసం తయారీకి స్టవ్ మీద మిరియాలు వేయించుకున్న కడాయినే పెట్టి అందులో ముందుగా పెట్టుకున్న చింతపండు రసం పోయాలి. తర్వాత అందులో పసుపు, తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేంత వరకూ మరిగించుకోవాలి.

Authentic Udupi Style Pepper Rasam No Garlic No Tomato Festive Special Recipe

ఆ మిశ్రమంలో బెల్లం తురుము, గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పేస్టు వేయాలి. అలా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ క్రమంలో తాలింపు రెడీ చేసుకోవాలి. చిన్న గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో ఆవాలు,కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పోపు చేయాలి. ఇప్పుడు తాలింపును రసంలో వేసి ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే ఉడుపి స్టైల్​ 'మిరియాల చారు' రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+