మామిడిపండు తింటుంటే ఈ విషయాలు తెలుసుకోండి
మామిడి పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎందుకంటే అది పండ్లలో రారాజు. వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. దీని రుచిని ఆస్వాదిస్తే ఆ ఆనందమే వేరు. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మామిడి తినేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు. లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మామిడిపండుతో కలిపి ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాటి వివరాలను తెలుసుకుందాం.

పెరుగు
మామిడి పండుతో కలిపి పెరుగు తినకూడదు. ఈ రెండు కలిపి తింటే కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. తద్వారా కడుపునొప్పితోపాటు ఇతరత్రా సమస్యలు వస్తాయి.
శీతల పానీయాలు
రాత్రిపూట భోజనంలో మామిడిపండు తింటున్నట్లయితే దాంతోపాటు శీతల పానీయాలు తీసుకోవద్దు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడంవల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. జలులు చేస్తుంది.
స్పైసీ ఫుడ్
మామిడిపండ్లను రాత్రిపూట భోజనంలో లేదంటే మధ్యాహ్న భోజనంలో తినడానికి చాలామంది ఇష్టపడతారు. మామిడి తిన్న వెంటనే స్పైసీ ఫుడ్ తినకూడదు. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
చేదు పదార్థాలు
మామిడికాయతో కాకరకాయ కలిపి తినకూడదు. అలా తింటే విషతుల్యం అవుతుంది. అనేక సమస్యలు కలుగుతాయి.
పచ్చి మిరపకాయలు
పచ్చి మిరపకాయలను మామిడికాయలతో కలిపి తినకూడదు. తింటే కడుపులో చికాకు కలుగుతుంది. విరేచనాలు అవుతాయి.
నీళ్లు తాగొద్దు
మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు. తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి చేస్తుంది.
ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ తో కలిపి మామిడి తినకూడదు. మామిడిలో సహజ చక్కెర ఉంటుంది. బ్లడ్ లో షుగరు లెవల్స్ పెరుగుతాయి. కడుపునకు సంబంధించిన సమస్యలు రావడంతోపాటు జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.












Click it and Unblock the Notifications