ఇదొక్కటి చేయండి.. షుగరు టాబ్లెట్లు విసిరి కొట్టండి!

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం. రోజురోజుకు జీవన శైలి మారుతుండటంతోపాటు శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో అధిక సమయం కూర్చొని పనిచేస్తుండటం, మారుతున్న ఆహారపు అలవాట్లన్నీ కలిపి షుగరు వ్యాధిబారిన పడటానికి కారణమవుతున్నాయి. మధుమేహాన్ని రాకుండా చూసుకోవడానికి, వచ్చినా అదుపు చేయడానికి అనేక మార్గాలున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నించగా అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలున్నాయి.

కాకరకాయ అంటేనే ఎవరూ తినడానికి కూడా మొగ్గుచూపరు. నోటికి ఏదైతే చేదుగా ఉంటుందో అది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మధుమహే వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కాకరకాయ రసం తాగాలి. దీనివల్ల షుగరు అదుపులో ఉంటుంది. కాకరకాయలో ఉండే పాలీపెప్లైడ్ సమ్మేళనం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Ayurvedic methods to control sugar levels in blood

ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక టీ స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టాలి. తర్వాతరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున ఈ నీటిని తీసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. టైప్2 మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు పది గ్రాముల మెంతులను నానబెట్టి తర్వాతరోజు ఉదయం తాగాలి. దీనికి సంబంధించిన ఓ కథనం కూడా జర్నల్ లో ప్రచురితమైంది. ఇలా చేయడంవల్ల హిమోగ్లోబిన్ ఏవన్ సి గణనీయంగా తగ్గింది.

మధుమేహం ఉన్నవారు కచ్చితంగా చేయాల్సిన మరోపని.. ఉసిరికాయ రసం తాగాలి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మూడు ఉసిరికాయలను మిక్సీలో వేసుకొని మెత్తగా చేసి దానికి మళ్లీ గ్లాసు నీరు కలిపి మిక్సీ చేయాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పరగడుపున తీసుకుంటే రక్తంలో షుగరు కంట్రోల్ లో ఉంటుంది.

మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క బాగా ఉపయోగడపతుంది. గ్లాసు వేడినీటిలో నాలుగు చిన్న చిన్న దాల్చిన చెక్కల్ని వేసి మూతపెట్టాలి. అలా పది నిముషాల సమయం గడిచిన తర్వాత ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత దీన్ని తాగాలి. దీనివల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+