Beauty tips నిగనిగలాడే మెరిసే చర్మం కోసం సింపుల్ కె-బ్యూటీ టిప్స్!!
కొరియన్లు తమ సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి పెడతారు. కొరియన్లు ఎప్పుడు గ్లాసులా మెరిసే నిగారింపు ఉన్న చర్మం కోసం తెగ తాపత్రయ పడతారు. ఈ క్రమంలో వారు న్యాచురల్ ప్రొడక్ట్స్ తోనే రకరకాల సౌందర్య ఉత్పత్తులను తయారు చేసుకుని వినియోగిస్తారు. ఇక ఈ క్రమంలో కొరియా దేశాలలో మాత్రమే కాకుండా కె బ్యూటీ ఇప్పుడు అమ్మాయిలలో బాగా ట్రెండ్ అవుతుంది.
ఈ రోజుల్లో చాలావరకు అమ్మాయిలు కొరియన్ల తరహాలో అందంగా కనిపించాలని తన ముఖం మెరిసిపోవాలని కోరుకుంటారు. ఈ క్రమంలో మనం ఈరోజు కొరియన్ల అందం యొక్క కొన్ని ముఖ్యమైన దినచర్యలను గురించి తెలుసుకుందాం. సహజంగా గ్లో పొందటం కోసం కొరియన్లు బీట్ రూట్ దుంపలను ఉపయోగిస్తారు. బీట్ రూట్ దుంపల రసం ఎలాంటి హాని లేకుండా చర్మం మెరుపును సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

గులాబీ ఆకులను గ్రైండ్ చేసి రాసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇక ముఖంపై రోజు వాటర్ ను స్ప్రే చేసుకుంటే కూడా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాదు ముఖంపై, బుగ్గల పైన తేనే రాసుకుంటే కూడా ముఖం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది.
పచ్చి పాలలో తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే ఇది మీ చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు పంచదార, కొబ్బరి నూనె, కాఫీ పొడితో కలిపి ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచి చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే కూడా ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది.
కొరియన్లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడమే వారి బ్యూటీ ఒక సీక్రెట్. పొరబాటున కూడా వారు చర్మాన్ని డీ హైడ్రేట్ కానివ్వరు. అందుకే వారు గ్లాస్ లాంటి మెరుపును సొంతం చేసుకుంటారు. మనం కూడా పైన తెలిపిన సహజ పద్ధతుల ద్వారా చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే మంచిది. అది మన చర్మాన్ని గ్లాసులా తళుక్కున మెరిసేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications