వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Beauty tips: ముఖంపై ముడతలు పోవటానికి బొటాక్స్ ను మించిన సహజ చిట్కాలు ఇవే!!

|
Google Oneindia TeluguNews

ముఖం మీద ముడతలు మచ్చలు పోవడానికి వృద్ధాప్యపు చాయలు దగ్గరికి రాకుండా ఉండడానికి చాలామంది బొటాక్స్ ఇంజక్షన్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇంజెక్షన్లు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వవలసిన డోస్ కంటే ఎక్కువ ఇస్తే తీవ్రమైన అనారోగ్యాలు చోటు చేసుకునే ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ముఖం మీద ముడతలు, మచ్చలు పోవడానికి, చర్మం నిగారింపును సంతరించుకోవడానికి, వృద్ధాప్య జాడ దగ్గరకు రాకుండా ఉండడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ను పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నేచురోపతి వైద్యులు.

ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే ఈ చిట్కా బెస్ట్

ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే ఈ చిట్కా బెస్ట్


మనకు ఇంట్లో దొరికే వస్తువులతోని నాచురల్ గా మన ముఖం పైన ఉన్న ముడతలను, మచ్చలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. వంటింటి చిట్కాలతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకుని, అంతే రెండు స్పూన్ల బియ్యాన్ని తీసుకొని కొద్దిగా నీరు పోసి ఉడకబెట్టి, దాన్ని ఓ గుడ్డలో వేసి బాగా పిండి అందులోని గుజ్జును వేరుగా తీసుకొని, ఒక టీ స్పూన్ బాదం నూనె కలిపి, అర టీ స్పూన్ తేనె కలిపి దానిని ముఖానికి అప్లై చేసి, ఓ అరగంట సేపాగి ముఖం కడుక్కుంటే ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుందని, ముడతలు, మచ్చలు మాయమవుతాయని చెబుతున్నారు. ఇది బొటాక్స్ కంటే బెస్ట్ అని అంటున్నారు.

ఈ ఫేస్ ప్యాక్ లతోనూ ముడతలు మాయం

ఈ ఫేస్ ప్యాక్ లతోనూ ముడతలు మాయం

అంతేకాదు అర టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలిపి ఆ పేస్టును ముడతలు వచ్చిన చోట రాసుకుని అరగంట సేపు ఆగి తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖంపై ముడతలు పోతాయని చెప్తున్నారు. అంతేకాదు బొప్పాయి గుజ్జుతో ముఖంపై మసాజ్ చేసుకుని, ఓ అరగంటసేపు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడుక్కుంటే చక్కగా ముడతలు పోయి, చర్మం కాంతివంతంగా మెరుస్తుందని చెబుతున్నారు. ఆలుగడ్డ, టమాటా రసాన్ని కూడా ఫేస్ ప్యాక్ వేస్తే ముఖం మంచి గ్లో వస్తుందని, ముడతలు తగ్గుతాయని అంటున్నారు.

ఈ నేచురల్ వస్తువులతోనే ముడతలకు చెక్ పెట్టండి

ఈ నేచురల్ వస్తువులతోనే ముడతలకు చెక్ పెట్టండి

ఇక బాదం నూనెను ముఖంపైన ముడతలు వచ్చిన చోట రాత్రి వేళల్లో అప్లై చేసి, పొద్దున్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముడతలు తగ్గిపోతాయని సూచిస్తున్నారు. కలబంద కూడా ముఖం మీద ముడతలు, మచ్చలు తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు.కలబంద పైన తొక్క తీసి లోపలి తెల్లటి గుజ్జును, పసుపుతో కలిపి ముఖానికి అప్లై చేస్తే కచ్చితంగా మెరుగైన ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గటానికి సరైన నిద్ర, సరైన ఆహారం కూడా అవసరం అని అంటున్నారు. ఇంట్లో దొరికే నేచురల్ వస్తువులతోనే ముఖ సౌందర్యం మెరుగుపరచుకోవచ్చని, ముడతలు, మచ్చలు తగ్గించుకోవచ్చని అంటున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Beauty tips: అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!!Beauty tips: అందం కోసం ఏవేవో వాడకండి.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చెయ్యండి!!

English summary
There are natural tips to get rid of facial wrinkles without Botox treatment. With the natural tips, wrinkles are naturally reduced and beauty is enhanced. And those tips are for you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X