వేసవిలో బీర్లు ఎక్కువగా తాగుతున్నారా, ఏం జరుగుతుందో తెలుసా..!!
వేసవి మొదలైంది. వేసవి కాలంలో చాలా మంది బీరుని ఎక్కువగా తాగుతారు. ఆల్కహాల్ డ్రింక్స్ లో బీర్ ముందు వరుసలో ఉంది. దేశంలో అనేక రకాల బీర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆల్కహాలిక్ డ్రింక్‌లో 4% నుండి 6% ఆల్కహాల్ ఉంటుంది. యువత ముఖ్యంగా బీర్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీర్లు అతిగా తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి బీర్లు సేవిస్తే శరీరంలోని అనేక అవయవాల పైన ప్రభావం చూపుతాయి. దీంతో.. వైద్యులు పరిమితి మేరకే తీసుకోవాలని సూచిస్తున్నారు.
బీర్లు అతిగా తాగితే దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం అతిగా సేవిస్తే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీర్లు ఎక్కువగా తాగడం వల్ల కాలేయానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అతిగా తాగే వారి కాలేయం కొవ్వుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు. మద్యానికి బానిసైన వారికి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తొలుత మత్తులో నిద్రపోయినా తర్వాత వారికి నిద్రాభంగం జరుగుతుంది. దీని వల్ల సరైన నిద్ర ఉండదు. మరుసటి రోజు అలసట, మానసిక ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు.

పరిమితి.. ఆరోగ్య పరిస్థితులకు అనుగణంగా
ఇక, బీరులో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరుగుతారని, తద్వారా ఊబకాయం సమస్య బారిన పడే అవకాశం ఉంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగి..దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మద్యం అతిగా సేవిస్తే అది మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలు దెబ్బతినడంతో జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకునే (డెషిషన్ మేకింగ్) సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. బీర్లు ఎక్కువగా సేవిస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనేక రకాల సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే బీరు మితంగా తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మగవారు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించకుండా తాగాలి. అతిగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని గుర్తించాలి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications