బీర్ Vs విస్కీ..ఏది ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుంది..!?
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. అదే సమయంలో మద్యం ప్రియులు మాత్రం తమకు ఇష్టమైన బ్రాండ్లను తీసుకుంటూనే ఉంటారు. ఎక్కువగా బీరు, విస్కీలను ఇష్టపడతారు. చాలా మంది ఆల్కహాల్ ప్రియులు బీరును ఇష్టపడతారు. ఇంకొంతమంది విస్కీ మంచిదని అంటారు. బీర్ లో 4 నుండి 6 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ తక్కువగా ఉన్న కారణంగా దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. విస్కీలో 40 శాతం కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటుంది. దీనిని కొద్దిగా తీసుకున్నా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ రెండింటిలో ఏది తీసుకుంటే ఏం జరుగుతుందో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఆల్కహాల్ కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం అవసరం. బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోకి ఆల్కహాల్ ఎక్కువగా వెళ్తుంది కనుక వీటిని మితంగా తీసుకోవడం మంచిది. అలాగే బీర్ లో కార్బొహైడ్రేట్స్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. బీర్ లో దాదాపు 150 నుండి 200 క్యాలరీలు ఉంటాయి. విస్కీలో కార్బొహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 60ఎంఎల్ పెగ్‌లో దాదాపు 70 క్యాలరీలు ఉంటాయి. బీర్ ను తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. అధ్యయనాల ప్రకారం బీర్ లో పాలీఫినాల్స్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విస్కీలో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. అయితే విస్కీలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక బీర్ కంటే విస్కీ గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కాలేయ ఆరోగ్యం విషయానికి వస్తే అధికంగా తీసుకోవడం వల్ల ఇవి రెండు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

పరిమితంగా తీసుకోవటం ద్వారా
కాగా,బీర్ ఎక్కువగా తాగడం వల్ల ఆల్కహాల్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లి కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. విస్కీ బలంగా ఉన్నప్పటికీ దీనిని తక్కువగా తాగుతారు కనుక ఆల్కహాల్ ఎక్స్‌పోజర్ ను తగ్గిస్తుంది. బీర్ ను ఎక్కువగా తీసుకోవడం కంటే విస్కీని తక్కువగా తీసుకోవడం వల్ల కాలేయానికి ఎక్కువగా హాని కలగకుండా ఉంటుంది. జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి వస్తే బీర్ లో ప్రోబయోటిక్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే బీర్ ను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. విస్కీలో గ్లూటెన్ ఉండదు. దీనిని తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణక్రియ సులభతరం అవుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రెండింటిని మితంగా తీసుకోవడం మంచిది. బీర్, విస్కీ రెండు కూడా మన శరీరానికి లాభాన్ని , నష్టాన్ని కలిగిస్తాయి. ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఏదైనా మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications