బీరకాయ పెరుగు కూర.. ఇలా చేస్తే మామూలుగా ఉండదు!

ఎండాకాలంలో లేదా వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో శరీరానికి చల్లదనం ఇచ్చే వంటకాలు ఎంతో అవసరం. అలాంటి వాటిలో బీరకాయ పెరుగు కూర ఒకటి. బీరకాయను రకరకాలుగా వండుతారు. పాలు పోసి, ఎగ్ వేసి, పెసరపప్పుతోనూ ఇలా ఎన్నో రకాలుగా బీరకాయ కూరను వండుకోవచ్చు. అయితే పెరుగుతో బీరకాయ కూర చేసుకోవటం చాలా సులభం. రుచి కూడా చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్థాలు:

బీరకాయ ముక్కలు - 2 కప్పులు
పెరుగు - 3 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - కొద్దిగా
ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి - పోపు కోసం
కారం - 1 టీ స్పూన్
కరివేపాకు - 10 ఆకులు
పచ్చిమిర్చి - 2 నుంచి 3
నూనె - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

Beerakaya Perugu Curry Recipe - Easy Traditional Ridge Gourd Yogurt Curry know simple making process

తయారీ విధానం:

ముందుగా బీరకాయలను బాగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి బీరకాయ ముక్కలను వేయించుకోవాలి. లేదా నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవచ్చు. బీరకాయలు ఉడికాక పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పెరుగు తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి మజ్జిగలా చేసుకోవాలి.

దీనిలో ఉడికించిన బీరకాయ ముక్కలు వేసి కలపాలి. స్టవ్ మీద మీడియం మంటపై కొద్దిసేపు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే పెరుగు పగిలిపోతుంది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు పోపు పెట్టాలి. ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపును పెరుగు కూరలో వేసి కలపాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుంటే రుచి ఇంకా బాగుంటుంది.

బొమ్మిడాల పులుసు.. ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
బొమ్మిడాల పులుసు.. ఆంధ్రా స్టైల్ చేపల పులుసు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

ఈ కూరను వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.ఒక్కసారి చేసి తింటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంతో కలిపి తింటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+