బెండకాయలు, టమాటాలు ఇలా పచ్చడి చేస్తే అదిరిపోద్ది!
బెండకాయ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయ. ఈ కూరగాయతో పులుసు, ఫ్రై, కూర వంటివి తరచుగా చేస్తుంటారు. కానీ డిఫరెంట్ స్టైల్ లో బెండకాయ పచ్చడి చేసుకు తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు అందులో పోషక ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. అయితే, ప్రస్తుతం మనం బెండకాయలతో పాటు టమాటాలు కూడా కలిపి తయారు చేసే పచ్చడిని ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు
బెండకాయలు - పావుకిలో
టమాటాలు - నాలుగు
పచ్చి మిరపకాయలు -10 కారాన్ని బట్టి
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - ఒక స్పూన్
కరేపాకు - రెండు రెమ్మలు
చింతపండు- ఉసిరికాయంత
ధనియాలు - ఒక స్పూన్
నూనె- ౩ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. అందులో కొద్దిగా నూనె వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి వేయించాలి. బెండకాయలు మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి, అందులోనే మరికొంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు టమాటాల ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు,ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి.
బెండకాయ, టమాటా పచ్చడి ఇలా చేస్తే రెడీ
బాగా టమాటాలు, పచ్చి మిరపకాయలు మగ్గిన తర్వాత దీనిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చెయ్యాలి. టమాటాలు గ్రైండ్ చేసిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరేపాకు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ చెయ్యాలి. అంతే రుచికరమైన బెండకాయ, టమాటా పచ్చడి రెడీ అయ్యింది. ఇది అన్నంలోకే కాదు, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.
ఇలా తిన్నా బోలెడు బెనిఫిట్స్
అయితే దీనిని నేరుగా తినొచ్చు . లేదా దీనిని మరో చిన్న పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసి పోపు గింజలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి పోపు చేసుకుని కూడా తినొచ్చు. అయితే బెండకాయలో ఉండే జిగురు ఇలా తింటే మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.












Click it and Unblock the Notifications