సాల్ట్ వాటర్.. ఓ చక్కటి డాక్టర్!!

Salt Water: నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని, దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు అంటున్నారు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని తేల్చి చెబుతున్నారు.

ఉప్పులో ఉండే సోడియం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా ఎక్కువగా చెమట పట్టినప్పుడు, నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే శరీరం నీటిని సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.

శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు శరీరంలోని సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కోల్పోతాం. ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల ఆ ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందవచ్చు. ఇది నరాల పనితీరును, కండరాల సంకోచాన్ని, సాధారణ కణ ప్రక్రియలను మెరుగుపరుస్తుంది.

నరాల ఉత్తేజానికి, కండరాల సంకోచానికి సోడియం చాలా అవసరం. ఉప్పు కలిపిన నీటిని తాగడం ద్వారా తగినంత సోడియాన్ని శరీరానికి అందజేయవచ్చు. ఇది కండరాల నొప్పులను నివారిస్తుంది, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మరింత సవ్యంగా సాగేలా చేస్తుంది.

ఉప్పు డైజెస్టివ్ ఎంజైమ్‌లు, లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, మనం తాగే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా తగిన మోతాదులో అందుతాయి.

ఎక్కువ ఉప్పు రక్తపోటును పెంచుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అదే సమయంలో తక్కువ మోతాదులో, తగినంత ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. ఇది రక్త పరిమాణాన్ని స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరం నుండి విషాన్ని, హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను ఈ చిటికెడు ఉప్పు.. చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

శరీరంలో సోడియం స్థాయి సరిగ్గా ఉంటే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఆ హార్మోన్లు అదుపులో ఉంటాయి. నిద్రపోయే ముందు కొద్దిగా ఉప్పు కలిపిన నీటిని తాగితే ఎంతో బెటర్. హాయిగా నిద్ర పడుతుంది.

ఉప్పులో ఉండే సహజ లవణాలు, అందులో ఉండే ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. స్కిన్ డ్రై నెస్ మటుమాయం అవుతుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత సరిగ్గా ఉంటే కణాల శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది. నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా అలసట లేకుండా పనిచేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+