చిరంజీవి కాదు.. బాలయ్యే నెం.1

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న అత్యంత ఆసక్తికరమైన రేస్ ఏదంటే.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య పోటీ. ఎవరి రికార్డులు వారివే, ఎవరి అభిమాన గణం వారిదే. ఇప్పటికీ ఇద్దరూ అంతే ఉత్సాహంతో వరుస హిట్లు కొడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. అయితే, వీరిద్దరి వ్యక్తిత్వాలు, పనితీరుపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సి. కళ్యాణ్ మాట్లాడుతూ, చిరంజీవి, బాలకృష్ణలలో తన దృష్టిలో ఎవరు నెంబర్ 1 అనే అంశంపై నిర్మొహమాటంగా స్పందించారు. సినిమాల హిట్లు, ఫ్లాపులు, బాక్సాఫీస్ వసూళ్లు లేదా కెరీర్ గ్రాఫ్‌లను పక్కనబెడితే.. నటుడిగా, మనిషిగా బాలకృష్ణే తన దృష్టిలో నెంబర్ 1 స్థానంలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.

35 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో అతని ప్రాణ స్నేహితుడు
35 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో అతని ప్రాణ స్నేహితుడు
Tollywood Producer Kalyan Says That Balakrishna is Number one in Industry and Not Chiranjeevi

బాలయ్య క్షణాల్లో స్పందిస్తారు

ఇద్దరి ప్రవర్తన, సమస్యలను ఎదుర్కొనే విధానం గురించి విశ్లేషిస్తూ సి. కళ్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఏదైనా సమస్య ఎదురైనా, కోపం లేదా బాధ వచ్చినా బాలయ్య క్షణాల్లో స్పందిస్తారని, మనసులో ఏదీ దాచుకోకుండా స్పాట్‌లోనే రియాక్ట్ అయి ఆ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేస్తారని కొనియాడారు.అదే సమయంలో చిరంజీవిని తాను 'బాస్' అని పిలిచినప్పటికీ ఆయన శైలి వేరుగా ఉంటుందని చెప్పారు. ఏదైనా ఇష్యూ వస్తే చిరు వెంటనే రియాక్ట్ అవ్వరని, అందరి ముందు తన కోపాన్ని గానీ, బాధను గానీ బయటపడనీయకుండా వేరే వాళ్ల చేత చెప్పించే ప్రయత్నం చేస్తారని ఆయన పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాను చావుదెబ్బ కొట్టిన ఆర్.నారాయణమూర్తి
మెగాస్టార్ చిరంజీవి సినిమాను చావుదెబ్బ కొట్టిన ఆర్.నారాయణమూర్తి

సరదాగా నవ్వి ఊరుకున్నారు

చిరంజీవితో సినిమా చేసే విషయంపై స్పందిస్తూ, తాను సరదాగా అడిగినా ఆయన నవ్వి ఊరుకున్నారే తప్ప ఎప్పుడూ కాంబినేషన్ గురించి మాట్లాడలేదని కళ్యాణ్ అన్నారు. అయితే, రామ్ చరణ్ మాత్రం తనకు నమ్మకం ఇచ్చి, కలసి సినిమా చేద్దామని అన్నారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో మెగా కాంపౌండ్‌లో తనకు అత్యంత ఆప్తుడు అల్లు అరవింద్ అని కళ్యాణ్ తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది గేలి చేసినా, అల్లు అరవింద్ మాత్రం ఎప్పుడూ తన శ్రేయస్సునే కోరుకున్నారని అన్నారు.

మొత్తం టాలీవుడ్‌లోనే తాను అత్యంత గౌరవించే వ్యక్తి అల్లు అరవిందేనని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణల పోటీ రసవత్తరంగా సాగుతుంటే.. ఇంకోవైపు నిర్మాతల కోణంలో వారి వ్యక్తిత్వాల ఆధారంగా సాగే ఈ విశ్లేషణలు ఫిలిం నగర్‌లో ఆసక్తికరంగా మారాయి. సి. కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+