టీతోపాటు బిస్కెట్లు కూడా తీసుకుంటున్నారా?
భారతీయులకు, తేనీరుకు విడదీయరాని బంధం ఉంటుంది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత టీ తాగనిదే ఆరోజు గడవదు. కొందరు నిద్ర మత్తు వదిలించుకునే ఔషధంగా తీసుకుంటుంటారు. మరికొందరు ఎనర్జీ బూస్టర్ గా భావిస్తుంటారు. టీ తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. చాలామంది టీతోపాటు బిస్కెట్లు తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హానిచేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ అలవాటు డీఎన్ ఏను దెబ్బతీస్తుందని, అనేక వ్యాధులకు స్వాగతం పలికినట్లేనని చెబుతున్నారు.
టీతో పాటు బిస్కెట్లు తింటే బీపీ పెరుగుతుంది. హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే ముప్పు పెరుగుతుంది. బిస్కెట్లలో సోడియం ఎక్కువగా ఉండి హైపర్‌టెన్షన్ ముప్పు ను పెంచుతుంది. గుండె సమస్యలు, గుండె పోటు రావడానికి ఈ హైపర్ టెన్షనే ప్రధాన కారణం. బిస్కెట్ తయారీకి చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. టీలో ఉండే చక్కెర, ఈ చక్కెర కలగలిపి ఇన్సులిన్ శోషణకు అడ్డం పడతాయి. హార్మోన్ల అసమతుల్యతద్వారా డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. అంతేకాదు.. శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడంద్వారా అవి జీర్ణక్రియను అడ్డుకుంటాయి. ఇది మలబద్దకానికి దారితీస్తుంది.

బిస్కెట్లు ప్రాసెస్ చేసిన ఆహారం. ఇందులో DNA ను దెబ్బతిసే BHA, BHT ఉంటుంది. హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతుకు దారితీయడానికి కారణమవుతుంది. వేయించిన శనగలు తింటే మంచిదని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్సులిన్ ను నియంత్రించి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. శనగల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే బి కాంప్లెక్స్ తోపాటు జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ కూడా ఉంటుంది. ఎముకలకు బలాన్నిచ్చే మెగ్నీషియం, కాల్షియం లభిస్తాయి.












Click it and Unblock the Notifications