ఈ ఆహారం అందించే ఆరోగ్య ప్రయోజనాలకు డాక్టర్లు ఆశ్చర్యపోయారు!
మనం నిత్యం అన్నం తింటాం.. కానీ తెల్ల అన్నం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక ఇటీవల కాలంలో బ్లాక్ రైస్ ఎక్కువమంది వినియోగిస్తున్నారు. బ్లాక్ రైస్ లో ఉండే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని చెబుతున్నారు. బ్లాక్ రైస్ లో ఉండే పోషక విలువలు అన్ని ఇన్ని కావు.
బ్లాక్ రైస్ .. మంచి ఆహార ఎంపిక
బ్లాక్ రైస్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి . గ్లూటెన్ లేని ఆహారం కావడంతో దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. తెల్ల బియ్యం కంటే భిన్నంగా, బ్లాక్ రైస్ అన్ని పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది.తమ ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి ఇది ఆరోగ్యకరమైన ఎంపిక గా చెప్పవచ్చు.

బ్లాక్ రైస్ తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. బ్లాక్ రైస్ తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసిమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఫలితాలను ఇస్తుంది. బ్లాక్ రైస్ లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనకు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
బ్లాక్ రైస్ తో ఈ లాభాలు కూడా
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కూడా దోహదం చేస్తుంది. బ్లాక్ రైస్ లో ఉండే ప్రోటీన్ మన కండరాలను మరమ్మత్తు చేస్తుంది. కండరాల వృద్ధికి దోహదం చేస్తుంది. బ్లాక్ రైస్ మన చర్మానికి, జుట్టుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు మన కళ్ళ ఆరోగ్యానికి కూడా బ్లాక్ రైస్ ఎంతో మంచిది. బ్లాక్ రైస్ తినడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వైద్యులు ఆశ్చర్యపోయేలా ఆరోగ్య ప్రయోజనాలు
బ్లాక్ రైస్ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బ్లాక్ రైస్ ను మనం వైట్ రైస్ కు బదులుగా తీసుకుంటే మన శరీరానికి మేలు జరుగుతుంది. బ్లాక్ రైస్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేయడంతో చాలామంది వైద్యులు తమ పేషెంట్లకు బ్లాక్ రైస్ తినాలని రికమండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications