ఆయిల్ మసాజ్ తో శరీరానికి అద్భుత ఫలితాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి కూడా మారుతూ వస్తోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఎక్కువ కావడంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడంవల్ల నొప్పులు వస్తున్నాయి. కొంతమందికి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. టాబ్లెట్లు వాడుతున్నప్పటికీ వాటివల్ల ఇతర దుష్ప్రభావాలు వస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని నూనెతో మసాజ్ చేస్తే లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి.
శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. దీనికి కూడా విశ్రాంతినిస్తుండాలి. నెల మొత్తంమీద నాలుగు నుంచి ఐదుసార్లు బాడీ మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. మసాజ్ శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. మంచి విశ్రాంతి లభించడంవల్ల మానసికంగా ధృఢంగా మారతారు.

క్రమం తప్పకుండా బాడీ మసాజ్ చేయడంవల్ల కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల మనిషి మూడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది.కండరాలు రిలాక్స్ అవుతాయి క్రమం తప్పకుండా బాడీ మసాజ్ లేదా ఆయిల్ మసాజ్ చేస్తే కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీని వల్ల మూడ్ తాజాగా ఉంటుంది. శరీరానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మనసు కూడా విశ్రాంతి పొందుతుంది. వాస్తవానికి మసాజ్ ఒక థెరపీ లాంటిది. వారానికోసారి చేస్తుంటే శరీరం ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది.

బాడీ మసాజ్‌తో అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా మసాజ్ చేయించుకోవాలి.నూనెతో మసాజ్ చేయడంవల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. అంతేకాదు.. నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు.












Click it and Unblock the Notifications