వైట్ బ్రెడ్ vs బ్రౌన్ బ్రెడ్‌.. ఎవరికి ఏది మంచిది..!!

బ్రెడ్ ప్రతీ ఇంటా కనిపిస్తుంది. బ్రెడ్‌ని అల్పాహారంగా ఎక్కువ మంది తీసుకుంటారు. ఆరోగ్యకరం గా భావిస్తారు. అలాగే శాండ్‌విచ్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ జామ్ ఇలా వివిధ ర‌కాలుగా కూడా బ్రెడ్ ను ఆహారంలో భాగంగా తీసుకోవటం సహజంగా కనిపిస్తుంది. ఈ బ్రెడ్ మ‌న‌కు మార్కెట్ లో వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉండేవి వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. ఈ రెండు ర‌కాల బ్రెడ్ ల లో ఏది మంచిది.. ఎవరికి ఏది ప్రయోజనం. ఇలాంటి సందేహాల కు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

వైట్ - బ్రౌన్ బ్రెడ్. ఈ రెండు రకాల బ్రెడ్ లు ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్నారు. కాగా, వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యక‌ర‌మైన‌ద‌ని వారు చెబుతున్నారు. గోధుమ‌లు, హోల్ గ్రెయిన్స్ తో చేసిన బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అయితే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికీ కేవ‌లం రంగును చూసి మాత్ర‌మే ఆరోగ్యానికి మంచిద‌ని భావించ‌కూడ‌దు. మార్కెట్ లో బ్రౌన్ బ్రెడ్ అని న‌కిలీ బ్రెడ్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రౌన్ బ్రెడ్ ను కొనుగోలు చేసేట‌ప్పుడు కూడా వివిధ అంశాల‌ను గుర్తించుకుని కొనుగోలు చేయాల‌ని వారు చెబుతున్నారు. వైట్ బ్రెడ్ ను మైదా పిండితో త‌యారు చేస్తారు. దీనిలో విట‌మిన్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్ చాలా త‌క్కువ మోతాదులో ఉంటాయి. ఇక బ్రౌన్ బ్రెడ్ గోధుమ రంగులో క‌న‌బ‌డ‌డానికి కారామెల్ రంగును వాడుతూ ఉంటారు. ఇలా త‌యారు చేసిన బ్రెడ్ మంచిది కాదు.

brown-bread-is-a-healthier-option-than-white-bread-but-its-not-free-of-preservatives

బ్రౌన్ బ్రెడ్ ను కొనుగోలు చేసేట‌ప్పుడు 100 శాతం గోధుమ‌లతో, తృణ ధాన్యాల‌తో చేసిన బ్రెడ్ ను చూసి వినియోగించటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు ఉంటాయి. ఇక.. బ్రౌన్ బ్రెడ్ ఎక్కవగా గోధుమ‌ల‌తో, హోల్ గ్రెయిన్ ల‌తో చేయటం ద్వారా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే పోష‌కాలు కూడా అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పేగుల్లో క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. పేగులల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యానికి ఇవి మ‌ద్ద‌తును ఇస్తాయి. క‌నుక వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవ‌డ‌మే మంచిది. రంగుల‌తో చేసే బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. 100 శాతం గోధుమ‌ల‌తో చేసిన బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని, బ్రెడ్ ను కొనుగోలు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+